Home Filmy Adda ప్రేమ గురించి ఎమోషనల్ అయినా బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్.. ఏమన్నారంటే..!!

ప్రేమ గురించి ఎమోషనల్ అయినా బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్.. ఏమన్నారంటే..!!

by Sunku Sravan

వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో ఎంతో పేరు సంపాదించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆ పేరును మరింత రెట్టింపు చేసుకున్న వ్యక్తి షణ్ముక్. ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి.. అయితే షణ్ముఖ్ ప్రేమ గురించి ఒక ఎమోషనల్ పోస్టును పెట్టారు. ఇతని పూర్తి పేరు షణ్ముఖ్ జస్వంత్.

బిగ్ బాస్ లో ప్రారంభం నుంచే టైటిల్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ, చివరికి రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ లో సిరి తో ఆయన ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత దీప్తి సునయన తో బ్రేకప్ చెప్పిన విషయాలతో సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు. ఆయన చాలా రోజుల తర్వాత మళ్లీ తన నటన వైపు దృష్టి పెట్టారని తెలుస్తోంది.

త్వరలో ఆయన ఏజెంట్ ఆనంద్ అనే నూతన వెబ్ సిరీస్ ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన ఒక కొత్త ఇల్లు కొనుక్కొని గృహ ప్రవేశం కూడా చేశారు. షణ్ముఖి సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనం చెప్పుకోనవసరంలేదు. ఎప్పుడు కూడా కొత్త కొత్త అప్డేట్ ఇస్తూ ఉంటారు.

ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. లవ్ అనే టీ షర్టు వేసుకొని ప్రేమ గురించి ఒక ఎమోషనల్ కవితను షేర్ చేశారు. లవ్ అనేది చాలా చిన్న పదం.. కానీ దానిలో ఎన్నో క్లిష్టమైన పదాలు దాగి ఉంటాయి. అది నాకు అసలు సెట్ కాదని చెప్పుకొచ్చారు షణ్ముక్..

You may also like