“ఇలానే వాడిని ఎంకరేజ్ చేయమను… ఫస్ట్ లో పెట్టాడు కదా.?” అంటూ సిరి బాయ్ ఫ్రెండ్ పై షన్ను ఫైర్..!

“ఇలానే వాడిని ఎంకరేజ్ చేయమను… ఫస్ట్ లో పెట్టాడు కదా.?” అంటూ సిరి బాయ్ ఫ్రెండ్ పై షన్ను ఫైర్..!

by Megha Varna

Ads

ఇక బిగ్ బాస్ షో ముగింపు దశకు వచ్చేస్తోంది. ఇక హౌస్ మేట్స్ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే హౌస్ మేట్స్ ని విడిపోతామన్న బాధ చాలామందిలో కనబడుతోంది. అయితే ఎప్పటిలాగే సిరి, షన్ను కబుర్లలో బిజీగా ఉంటే మానస్, సన్నీకూడా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఏం చేయాలో తెలియని శ్రీ రామ్ మాత్రం కెమెరాతో మాట్లాడుతున్నాడు. అయితే షణ్ముఖ్ ని విడిచి వెళ్లిపోవాలన్న బాధలో సిరి ఉంది.

Video Advertisement

ఈ విషయాన్ని సిరి షన్నుకి ఒక హాగ్ ఇచ్చి మరీ చెప్పింది. అలానే వీళ్ళ మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ కూడా చోటు చేసుకుంది. సాక్షి కథనం ప్రకారం, సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరిని పెట్టారన్న విషయాన్ని మరొకసారి షన్ను ప్రస్తావించాడు. అలానే సన్నీ ప్రవర్తనలో కూడా ఏదో తేడా కొడుతోంది అంటూ షన్ను మాట్లాడాడు.

రెండు మూడు వారాలుగా సన్నీ చాలా డిఫరెంట్ గా వున్నాడు అంటూ సిరితో చెప్పాడు. పైగా సన్నీ ఫోటోని శ్రీహాన్ ఫస్ట్ లో పెట్టాడు కదా.. వాడు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంటాడు… వెళ్లి ఎంకరేజ్ చేయమని చెప్పు. నీకోసం స్టాండ్ తీసుకుంటే మీరు అవతలి వారికి ఇస్తారు మీ వాడికి హౌస్లో జరిగేవన్నీ తెలియదేమో.. వెళ్లి చెప్పు అన్నాడు. హగ్ ఇవ్వడం తప్పయితే ఇది ఏంటి..? అంటే ఇదంతా ఓకేనా అని షణ్ముఖ్ సిరి పై ఫైర్ అయ్యాడు.

అలాగే ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి కూడా స్ట్రెయిట్ హాగ్ ఇవ్వలేదంటూ సిరి తో చెప్పాడు. ఇవన్నీ విని సిరి భోరుమని ఏడిచింది. సిరి బాధ అంతా శ్రీహాన్ ని అన్నాడని కాదు. మరికొన్ని రోజుల్లో షన్నుకి దూరంగా వెళ్లిపోవాలని. ఎప్పుడూ ఒక మాట కూడా పడని సిరి షణ్ముఖ్ ఇలా అనే సరికి చాలా లైట్ తీసుకుంది. దీంతో ఆమె ప్రవర్తన అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు.


End of Article

You may also like