Home Filmy Adda Bigg Boss Telugu -5 : “షన్ను” బ్రహ్మ కాదు… నారదుడే…!

Bigg Boss Telugu -5 : “షన్ను” బ్రహ్మ కాదు… నారదుడే…!

by Megha Varna

షణ్ముఖ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయట ఎంత మంది ఓటు వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే హౌస్ లో మాత్రం షణ్ముఖ్ గేమ్ ఆడటం లేదని బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ తో బ్రహ్మ కాదు షన్ను నారదుడు అని తెలుస్తోంది.

ఎందుకు ఇలా అంటున్నారు అనే దాన్ని చూస్తే… ప్రియాంక కాజల్ ని నామినేట్ చేసింది అంటే షణ్ముఖ్ చెప్పిన మాటల వల్లే. కమ్యూనిటీ అనే పదాన్ని అసలు కాజల్ వాడింది ప్రియాంక కోసం. కానీ చివరకు కాజల్ ని ఆమె ఎలిమినేట్ చేసింది. పైగా సిల్లీ రీజన్ ఇచ్చింది. మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కాజల్ హమ్మయ్య మనోళ్లు అందరు వచ్చేసారని చెప్పింది.

Bigg Boss 5 Telugu Today Promo, This Week Nominations: Shanmukh Fires On Priyanka - Sakshi

అంటే దీనికి అర్థం మానస్, సన్నీ, కాజల్ వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అని. నిన్ను వాళ్లతో ఆమె కలపలేదు. దీన్ని బట్టి ఎవరు నీకు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలిసింది కదా..? వారు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలుసుకో అని షణ్ముఖ్ చెప్పాడు ప్రియాంకతో. ఇంకేముంది ప్రియాంక కాజల్ ని టార్గెట్ చేసింది. దీంతో షణ్ముఖ్ బ్రహ్మ కాదు నారదుడు అని అంటున్నారు.

You may also like