1999 లో, 2024 లో ఏపీ రాజకీయ పరిస్థితులు.. అప్పుడు హరికృష్ణ ఓడిపోయారు.. మరి ఈసారి షర్మిల గెలుస్తారా.?

1999 లో, 2024 లో ఏపీ రాజకీయ పరిస్థితులు.. అప్పుడు హరికృష్ణ ఓడిపోయారు.. మరి ఈసారి షర్మిల గెలుస్తారా.?

by Mounika Singaluri

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే గతంలో రాజకీయ నాయకుడిగా హరికృష్ణ లైఫ్ లో జరిగినదే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి షర్మిలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె ఒక ఇల్లాలిగా తన కుటుంబాన్ని చక్కపెట్టుకుంటున్న సమయంలో తండ్రి చనిపోవడం, జగన్ జైలుకు వెళ్లడం వంటి పరిస్థితుల వలన ఆమె రాజకీయాల్లోకి రావలసి వచ్చింది.

Video Advertisement

అయితే ఆంధ్రప్రదేస్ లోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కోసం పనిచేసిన షర్మిలకు తర్వాత అన్నతో విభేదాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ వదిలి తెలంగాణ వెళ్ళిపోయారు.

ys-sharmila-fires-on-cm-kcr

అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు కానీ ప్రాంతీయ పార్టీలతో పోరు భరించలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సేమ్ టు సేమ్ హరికృష్ణ రాజకీయ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. రాజకీయాలంటే అసలు ఆసక్తి లేని హరికృష్ణ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టడంతో ఆయనకి రథసారథిగా మారారు. తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాక ఆయనతో పొసగక పార్టీని విడిచి పెట్టేసారు హరికృష్ణ. తరువాత అన్నా టీడీపీ పేరిట సొంతంగా ఒక పార్టీ పెట్టారు.

sharmila hari krishna election sentiment

కానీ 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు.ఏడు సంవత్సరాల తర్వాత టీడీపీ చెంతకు చేరారు. చంద్రబాబు హరికృష్ణ కలిసి పోవడంతో టీడీపీ లో ఆయనకు కొంత గౌరవం పెరిగిందనే చెప్పాలి. హరికృష్ణ కూడా షర్మిల అలాగే తండ్రి కోసం పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు.

harikrishna

టీడీపీ కి రాజీనామా చెయ్యకపోయినా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పాలి. ఇష్టం లేకపోయినా రాజకీయాలలోకి రావడం, పార్టీతో పొసగక కొత్త పార్టీలు పెట్టడం ఆపై మళ్లీ పాత పార్టీలోనే విలీనం అవ్వటం ఈ సంఘటనలు అన్ని ఇద్దరి జీవితంలోనూ ఇంచుమించు ఒకే లాగా జరుగుతున్నాయి. మరి అప్పట్లో హరికృష్ణ ఓడిపోయారు. అదే ఇప్పుడు కూడా కొనసాగుతుందా లేదంటే షర్మిల విజయం సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.


You may also like

Leave a Comment