షర్మిల కుమారుడి పెళ్లి ముహూర్తం ఖరారు..! పెళ్లి జరిగేది ఎక్కడంటే..?

షర్మిల కుమారుడి పెళ్లి ముహూర్తం ఖరారు..! పెళ్లి జరిగేది ఎక్కడంటే..?

by Harika

Ads

వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి.

Video Advertisement

ఈమె కూడా అమెరికాలో విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. . ఇప్పుడువివాహ ముహూర్తంతో పాటుగా వేదికను కుటుంబ సభ్యులు ఖరారు చేసారు.

రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉన్నారు. జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో నిశ్చితార్థం ఉంటుందని తెలిసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ప్రియతో రాజారెడ్డి వివాహం ఖరారైన సంగతి తెలిసిందే. ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్‌ అమెరికాలో స్థిరపడ్డారు.

ys-sharmila-fires-on-cm-kcr

అయిత ప్రియా తండ్రి చట్నీస్‌ సంస్థల అధినేత ప్రసాద్‌ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆయనకు తమ అధినేతకి,చట్నీస్‌ సంస్థలతో ఏ సంబంధం లేదని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దగ్గరి బంధువులను మాత్రమే నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి.


End of Article

You may also like