Home Filmy Adda శర్వానంద్ – రామ్ చరణ్ త్వరలో బంధువులు కాబోతున్నారంట? ఇంతకీ శర్వా పెళ్లి చేసుకోబోయేది ఎవరిని?

శర్వానంద్ – రామ్ చరణ్ త్వరలో బంధువులు కాబోతున్నారంట? ఇంతకీ శర్వా పెళ్లి చేసుకోబోయేది ఎవరిని?

by Mohana Priya

ఇటీవల నిఖిల్, నితిన్, రానా లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ ఇంకా నితిన్ తాము త్వరలో పెళ్లి చేసుకుంటున్న విషయం గురించి ముందే అనౌన్స్ చేశారు. కానీ రానా మాత్రం లాక్ డౌన్ లోనే ఈ వార్తను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ జాబితా లోకి మరొక హీరో కూడా చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిల్మి ఫోకస్ కథనం ప్రకారం హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రామ్ చరణ్ భార్య ఉపాసన కి బంధువు అవుతారట.

గత కొంతకాలంగా శర్వానంద్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నారట. రామ్ చరణ్ శర్వానంద్ కుటుంబంతో, అలాగే ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా సరే ఈ విషయం అధికారికంగా ప్రకటించేంత వరకు ఈ వార్త కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ ఇది నిజం అయితే ఎప్పటినుండో స్నేహితులైన రామ్ చరణ్ ఇంకా శర్వానంద్ ఇప్పుడు బంధువులు అవుతారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి లో  వచ్చిన జాను సినిమా లో నటించారు శర్వానంద్. తర్వాత చిత్రం శ్రీకారం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి అప్ కమింగ్ సినిమా మహా సముద్రం లో కూడా హీరోగా నటించనున్నారు శర్వానంద్.

You may also like