Ads
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..దీంతో బస్సులు ,రైళ్లు ఇతరత్రా రవాణా మార్గాలు పూర్తిగా నిలిచిపోయాయి .ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు ..విమాన మార్గాన్ని కూడా ఆపేయడంతో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Video Advertisement
భారతదేశం నుండి విదేశాలలో పని చేసేందుకు వెళ్లిన వారు అక్కడ చనిపోయిన మృత దేహాన్ని లాక్ డౌన్ కారణంగా స్వదేశానికి పంపే అవకాశం లేక అక్కడే అంత్యక్రియలు నిర్వహించగా ఆయా ఫోటోలను వాట్సాప్ లో చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి ..భారత దేశంలోనే ఇతర రాష్ట్రాలలో చనిపోయిన వారి పరిస్థితి కూడా ఇదే.ఆఖరి చూపు చూసే అవకాశం కూడా లేకపోయింది అని రోదిస్తున్నారు ..కాగా టీవీ 9 కధనం ప్రకారం ఢిల్లీ లో చనిపోయిన సునీల్ అనే వ్యక్తి మృత దేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి వీలు లేక ఒక నమూనా బొమ్మను తయారుచేసి చితిపై ఉంచి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు..వివరాల్లోకి వెళ్తే ..
కరోనా మహమ్మారి ఓ నిరుపేద కూలీ కుటుంబంలో ఎప్పటికి మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లా దుమ్రీఖుండ్ గ్రామానికి చెందిన సునిల్ (38) అనే వలసకూలీ ఢిల్లీలో ఇటీవల తట్టు వ్యాధితో మృతి చెందాడు . అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ సొంత ఊర్లోనే ఉన్నారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో సునిల్ చనిపోయిన విషయాన్ని ఈ నెల 14న అతడి ఫోన్ నుంచే ఢిల్లీకి చెందిన ఒక పోలీసు దుమ్రీఖండ్‌లోని కుటుంబ సభ్యులకి తెలియజేశాడు.
అయితే ,సునీల్ మృత దేహాన్ని ఢిల్లీ నుండి తమ ఊరు తీసుకురావాలంటే 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని తెలియగా వారి దగ్గర అంత స్తొమత లేక ఎవరినైనా అడుగుదాం అంటే లాక్ డౌన్ ఆంక్షలు వారిని నైరాశ్యంలోకి నెట్టాయి.దీంతో మంగళవారం మృతదేహం లేకుండానే సునీల్ కు గుర్తుగా ఒక బొమ్మను తయారుచేసి ఆ బొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు .ఈ నేపథ్యంలో సునీల్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గురువారం ఢిల్లీలో అధికారులు అంత్యక్రియలు చెయ్యనున్నారు .
source: tv9telugu
End of Article