స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికాన్ని అందుకున్న ఐటమ్ గర్ల్.. ఏకంగా రూ. అన్ని కోట్లా?

స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికాన్ని అందుకున్న ఐటమ్ గర్ల్.. ఏకంగా రూ. అన్ని కోట్లా?

by Mounika Singaluri

Ads

ఇండియన్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఉండడం అన్నది కామన్. ఈ మధ్య కాలంలో ప్రతి 10 సినిమాలలో ఆరు సినిమాలలో ఈ ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది అంటే అందులో తప్పనిసరిగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. స్టార్ హీరోల చిత్రాల్లో తప్పకుండా ప్రత్యేక గీతం ఉండేలా ప్రణాళికలు రచిస్తారు. అంతేకాదు భారీ పారితోషికాలు ఇచ్చి మరీ స్టార్ నటీమణుల్ని స్పెషల్ సాంగ్స్ కోసం తీసుకుంటున్నారు. అటు కథానాయికలు కూడా మార్కెట్‌లో ఈ పాటలకున్న డిమాండ్ దృష్ట్యా, ఐటెం సాంగ్స్ చేసేందుకు ముందుకొస్తున్నారు.

Video Advertisement

samantha poster from pushpa special song

అలాంటి కథానాయికల జాబితాలో టాలీవుడ్ అగ్రనటి సమంత కూడా చేరిపోయింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ద రైజ్ సినిమాలో “ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా” అనే పాటకు చిందులు వేయడంతో పాటు స్టెప్పులను ఇరగదీసింది. ఈ సినిమా విడుదల అయ్యి యూట్యూబ్ లో రికార్డుల మూత మోగించింది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారుమోగిపోయింది. ఈ పాటలో మునుపెన్నడూ లేని విధంగా తన అందాల్ని కూడా ఆరబోసింది సామ్. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సమంత ఇలా ఒక ఐటెం సాంగ్‌లో నటించడంతో కచ్ఛితంగా భారీ పారితోషికమే అందుకుని ఉంటుందని అందరూ ఊహించారు. అయితే ఆ ఊహాగానాలకు అనుగుణంగానే ఆమె ఈ పాటకు గాను దాదాపుగా రూ.5 కోట్ల పారితోషికం అందుకుంది. ఐటమ్ సాంగ్కు ఆ రేంజ్ లో పారితోషికం అందుకున్న హీరోయిన్ ల జాబితాలో టాప్ వన్ లో నిలిచింది సమంత.

ఒక ఐటెం సాంగ్‌కి ఇంత అమౌంట్‌ని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కూడా అందుకోలేదు. స్పెషల్ సాంగ్స్ చేయడంలో తమదైన ప్రత్యేక ముద్ర వేసిన నోరా ఫతేహి, మలైకా అరోరా ఖాన్‌లు సైతం తక్కువ పారితోషికమే తీసుకుంటున్నారు నోరా ఫతేహి రూ.2 కోట్లు, మలైకా రూ.1.50 కోట్లు అందుకుంటుండగా సమంత మాత్రం వారి కంటే డబుల్ పారితోషికాన్ని అందుకుంది. బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరిగా స్థానం సంపాదించిన కత్రినా కైఫ్ అయితే ఒక్కో పాటకు రూ.2 కోట్లు పుచ్చుకుంటోంది. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.3 కోట్లు తీసుకుంటుండగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రూ. 1 కోటి మాత్రమే అందుకుంటోంది. నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న అయితే పూర్తి సినిమాకే రూ.2 కోట్లు చార్జ్ చేస్తోందని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే సమంత క్రేజ్ మామూలుగా లేదుగా అనిపిస్తోంది.


End of Article

You may also like