Ads
తన భర్త రాజ్ కుంద్రా వివాదంపై శిల్పా శెట్టి ఇవాళ మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా తన స్టేట్మెంట్ ని విడుదల చేశారు. ఇందులో శిల్పా శెట్టి ఈ విధంగా పేర్కొన్నారు. “అవును. గత కొన్ని రోజుల నుండి నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్ను. చాలా పుకార్లు, చాలా ఆరోపణలు వచ్చాయి. మీడియా ఇంకా నేనంటే నచ్చని వాళ్ళు నాపై చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు”.
Video Advertisement
నా మీద మాత్రమే కాకుండా, నా కుటుంబంపై కూడా ఎన్నో నిందలు వేశారు. నేను ఈ విషయంపై స్పందించలేదు. స్పందించను కూడా. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది. నాకు ముంబై పోలీస్ మీద, అలాగే భారత న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. నా కుటుంబం అంతా కలిసి మాకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నాము”.
“కానీ అప్పటి వరకు నా తల్లి, అలాగే నా పిల్లల కోసం మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించమని అడుగుతున్నాను. ఎటువంటి రుజువులు లేని వార్తల గురించి కామెంట్ చేయడం నుండి కూడా దూరంగా ఉండాలని కోరుతున్నాను. నేను ఒక భారతీయ సిటిజెన్ ని. గత 29 సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎప్పుడూ నిరాశపరచలేదు”.
“కాబట్టి, ముఖ్యంగా ఈ సమయంలో, నా కుటుంబం, అలాగే నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మేము మీడియా విచారణకు అర్హులు కాదు. దయచేసి చట్టాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి. శిల్పా శెట్టి కుంద్రా.” అని స్టేట్మెంట్ ద్వారా పేర్కొన్నారు శిల్పా శెట్టి. ఇటీవల రాజ్ కుంద్రా విడుదలకై అప్లై చేసిన బెయిల్ ని కోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై విచారణ నడుస్తోంది.
End of Article