Ads
శివశంకర్ మాస్టర్ అందరికి నటుడిగానే.. జడ్జిగానే తెలుసు. ఆయన ఓ అద్భుతమైన నృత్య దర్శకుడు అని సినిమా పరిశ్రమకి మాత్రమే తెలుసు. ఆయన లేని లోటుని ఈ సినీ పరిశ్రమ పూడ్చలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శివ శంకర్ మాస్టార్ నిన్న రాత్రి శివైక్యం చెందారు.
Video Advertisement
క్లాస్ అయినా మాస్ అయినా స్టెప్పులు వేయించగలగడం శివ శంకర్ మాస్టర్ ప్రత్యేకత. మన్మధ రాజా అంటూ మనోజ్ తో మాస్ స్టెప్పులు వేయించినా.. ధీర ధీర అంటూ రామ్ చరణ్ తో క్లాస్ స్టెప్స్ వేయించినా ఆయన శైలే వేరు. దాదాపు మూడు తరాల హీరోలతో శివ శంకర్ మాస్టర్ స్టెప్పులు వేయించారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబులకు కూడా శివ శంకర్ మాస్టర్ స్టెప్పులేయించారు. ఆ తరువాతి తరం బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి వంటి హీరోలకు కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేసారు.
అయితే, శివ శంకర్ మాస్టర్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో శివ శంకర్ మాస్టర్ ప్రముఖ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. శివ శంకర్ మాస్టర్ ఈ వీడియోలో మాట్లాడుతూ, “చావు అందరికీ తప్పదు. ఏదో ఒక రోజు వస్తుంది. ఈ మట్టి రుణం తీరంగానే పోయి తీరాలి. కాని కొందరికి చావు అనేది చాలా తొందరగా వచ్చినప్పుడు అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనసుకి చాలా బాధాకరంగా ఉంటుంది” అంటూ శివ శంకర్ మాస్టర్ ఈ వీడియోలో మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
End of Article