Ads
ఆయన ఓ ఐఏఎస్. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈపాటికే అతని రేంజ్ ఏంటో మీకు అర్ధం అయ్యి ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ డాక్టర్ సంబంధం వచ్చింది. ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారు అనుకున్నారు పెద్దలు. కానీ కట్నం కింద ఆ వరుడు ఏం అడిగారో తెలుసా.? అతను అడిగిన దానికి అందరు ఫిదా అయిపోయారు. సాధారణంగా చదువు సంస్కారాన్ని ఇస్తుంది అని అంటారు కానీ సంస్కారంతో పాటు ఉన్నతమైన ఆలోచనలు, ఎదుటి వారికి సహాయం చేసే గుణంని కూడా ఇస్తుంది అని వీరు నిరూపించారు.
Video Advertisement
వివరాల్లోకి వెళ్తే తంజావూరు జిల్లా ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివ గురు ఐఏఎస్ వంటి పెద్ద చదువులు చూడడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఈ క్రమంలోని ఆయన ఎదుటివారి కష్టాలని కూడా అర్థం చేసుకోగలిగారు. ప్రస్తుతం తీరు సెల్విలో సబ్ కలెక్టర్ గారు ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ,
తన ఉరి ప్రజలకు ఇంక సేవ చేయాలని ఉద్దేశంతో తన పెళ్ళికి ఒక విచిత్రమైన వరకట్నం తీసుకోవాలి అనుకున్నారు. ఆయనని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత స్థాయిలో ఉన్న యువతులు ముందుకు వచ్చినప్పటికీ ఆయన డాక్టర్నే పెళ్లి చేసుకుంటాను అనడంతో ఆయన కోరిన విధంగా కట్నం ఇచ్చే డాక్టర్ యువతి కోసం ఆయన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో చెన్నై నందనం కళాశాలలో పని చేసే గణిత అధ్యాపకురాలు కుమార్తె అయిన కృష్ణభారతి ని చూసారు. ఆమెను పెళ్లాడాలంటే…ప్రభాకర్ ఓ షరతు పెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలంటే ఆ డాక్టర్ వారంలో 2 రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకి ఉచితంగా వైద్యం చేయడమే కట్నం గా తీసుకుంటా అని అతను తెలిపారు. అందుకు ఆమె సంతోషంగా ఒప్పుకోవడంతో వారి వివాహం ఫిబ్రవరి 26 న జరిగింది…ప్రస్తుతం వారి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…
సెల్యూట్ కలెక్టర్ సాబ్.!
End of Article