సర్ప్రైస్ చేద్దామనుకుంటే…క్లాస్ పీకింది శివజ్యోతి..! అసలేమైందో చూసి నవ్వుకోండి! (వీడియో)

సర్ప్రైస్ చేద్దామనుకుంటే…క్లాస్ పీకింది శివజ్యోతి..! అసలేమైందో చూసి నవ్వుకోండి! (వీడియో)

by Sainath Gopi

Ads

శివ జ్యోతి అనే బదులు సావిత్రక్క అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. తెలంగాణ యాసతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ బిత్తిరి సత్తితో కలిసి షో చేసారు. తర్వాత బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు శివ జ్యోతి. బిగ్ బాస్ హౌస్ లో ఆమెను చూసిన వారందరు ఆమె చాలా ఎమోషనల్ అంటూ కామెంట్స్ చేసారు. ఎందుకంటే ప్రతి సన్నివేశంలో ఆమె కంటతడి పెట్టేసుతుంటారు.

Video Advertisement

శివజ్యోతి సొంత ఊరు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామం. ఆమె తల్లితండ్రులు యశోద, రాజమల్లేష్. ల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఆర్‌ఎంపీ డాక్టర్. యాంకర్‌గా రాణించాలనుకున్న జ్యోతి, వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. అయితే అక్కడ తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకో..నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. దీంతో చాలా ఇబ్బంది ప‌డిన త‌ర్వాత‌.. వి6 ఛానెల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివేవారికోసం చేసిన ఆడిషన్ లో జ్యోతి ఎంపికైంది. అలా వి6 ఛానల్ లో అవకాశం వచ్చింది.

ఇది ఇలా ఉంటె..ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని. హైదరాబాద్‌లో మంగళవారం నాడు తన తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను వైభవంగా నిర్వహించింది శివజ్యోతి. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టంట్స్ ని ఆహ్వానించడంతో అందరూ కూడా హాజరయ్యి శివజ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గృహప్రవేశ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని ఆహ్వానించడంతో.. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ. ఈ సందర్భంగా హిమజ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది.

అంతేకాదు హిమజ మరో వీడియో కూడా షేర్ చేసింది. సర్ప్రైస్ చేద్దాం అనుకుంటే నన్ను మా డ్రైవర్ ని తిట్టేస్తుంది శివజ్యోతి అంటూ కాప్షన్ పెట్టింది. హ్యాపీ హౌస్ వార్మింగ్ అని విషెస్ చెపుతుంటే …దీనికి కూడా పాట పాడతారా అంటూ కామెడీ చేసింది. ఆ వీడియో మీరే చూడండి.

 

View this post on Instagram

 

Surprise chedhamanukunte Naku,Na driver ki class peekindhi ‍♀️

A post shared by Himaja Mallireddy (@itshimaja) on


End of Article

You may also like