Ads
- చిత్రం : శివ వేద
- నటీనటులు : డాక్టర్ శివరాజ్‌కుమార్, గానవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్.
- నిర్మాత : గీతా శివరాజ్‌కుమార్, జీ స్టూడియోస్
- దర్శకత్వం : ఎ. హర్ష
- సంగీతం : అర్జున్ జన్య
- విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2023
Video Advertisement
స్టోరీ :
ఒక ఊరిలో ఉండే వేద (శివరాజ్‌కుమార్), అతని కుమార్తె కనక (అదితి సాగర్) కలిసి హత్యలు చేస్తూ ఉంటారు. వారి కుటుంబానికి కొంత మంది ఇబ్బందులు కలిగిస్తారు. వారిని చంపడానికి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారుతూ ఉంటారు. ఒక ఊరిలో రౌడీగా ఉన్న ఒక వ్యక్తిని చంపాలి అని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీళ్ళు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? వీరి కథ ఏంటి? వీరు అనుకున్నది సాధించగలిగారా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా తెలుగులో వచ్చే డబ్బింగ్ సినిమాలు అంటే ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీ నుండి మాత్రమే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మలయాళం, కన్నడ ఇండస్ట్రీల సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలకి కూడా తెలుగులో చాలా గుర్తింపు వస్తోంది. ఈ సినిమా కూడా కన్నడ సినిమా అయినా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
సినిమా మొత్తం కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. సినిమాలో స్త్రీలపై జరిగే అన్యాయాలని, వారు ఎదుర్కొనే సమస్యలని చూపించారు. ఇలాంటి ఒక కథను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలి అని అనుకోవడం, అందులో నటించడం శివరాజ్‌కుమార్ ని ప్రశంసించాల్సిన విషయం. సినిమాని తెలుగులో డబ్ చేసినా కూడా సినిమా మొత్తం కూడా కన్నడ నేటివిటీకి తగ్గట్టు ఉంది కాబట్టి కొన్ని సీన్స్ ప్రేక్షకులకి ఎక్కవు.
అలాగే అర్జున్ జన్య అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇందులో చెప్పుకోవాల్సిన మరొక పాత్ర పుష్పగా నటించిన హీరోయిన్ గానవి లక్ష్మణ్. హీరోతో సమానంగా ఫైటింగ్స్ చేశారు. అలాగే వారి కూతురు పాత్ర పోషించిన అదితి కూడా చాలా బాగా నటించింది. క్లైమాక్స్ లో ఆమె నటన సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- యాక్షన్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
- పాటలు
- నిడివి
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
సినిమా మొత్తం చాలా స్లోగా నడుస్తుంది. నటీనటుల కోసం, యాక్షన్ సీన్స్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి శివ వేద సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article