షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది.

Video Advertisement

ఈ పోస్ట్ తో డైవర్స్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. మాలిక్ వివాహం చేసుకున్నట్టు, అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను ఈరోజు (జనవరి 20) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
2010 ఏప్రిల్‍లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్‍లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్‌ మాలిక్‌ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్‌ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్‍ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్‍ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్‌’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది.  2017లో డానిష్  మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్‌ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.

Also Read: ఈ తెలుగు హీరోయిన్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది అనే విషయం తెలుసా..? ఆమె ఎవరంటే..?


End of Article

You may also like