శోభనంకి సిద్ధమవుతుండగా…అధికారులు అడ్డుకున్నారు..! కొత్తజంటకు ఊహించని ట్విస్ట్!

శోభనంకి సిద్ధమవుతుండగా…అధికారులు అడ్డుకున్నారు..! కొత్తజంటకు ఊహించని ట్విస్ట్!

by Megha Varna

Ads

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చాలామంది పెళ్లిళ్లకు ముహర్తాలు పెట్టుకున్నవాళ్ళు క్యాన్సిల్ చేసుకోగా పెళ్లికాని వారు ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అని నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు .ఈ నేపథ్యంలో ఎన్నో అడ్డంకులు దాటి ఓ జంట పెళ్లిచేసుకున్నారు ..ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నా తొలిరేయికి సిద్ధమయ్యారు.మంచం మీద వివిధ రకాల పువ్వులతో అందంగా ముస్తాబు అయిన పడక గదిని ఊహించని అంతరాయం తలుపు కొట్టింది. జీవితం మొత్తం గుర్తుంచుకునే శుభ రాత్రి వాళ్లకు మాత్రం చేదు జ్ఞాపకంగా మారిపోయింది .

Video Advertisement

representative image

ఆ అంతరాయం ఏదో కాదు ..కరోనా వైరస్ .పెళ్ళికి కరోనా ఆటంకం కాలేదు గాని శోభనానికి ఎందుకు అయ్యిందో తెలియాలంటే కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి ..వివరాల్లోకి వెళ్తే ..కుత్యుర్ కు చెందిన వధువు ..బోలా జిల్లాకు చెందిన యువకుడిని పెళ్లాడింది ..లాక్ డౌన్ కారణంగా బంధువులను ఎవరిని పిలవకుండా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ..తొలిరాత్రి కోసం వరుడు ఇంట్లో ఏర్పాట్లు చేసారు ..కావున వధువు ను వరుడు ఇంటికి తీసుకెళ్లాడు .రాత్రి వేళలో శోభనానికి సంసిద్ధం అవుతున్న సమయంలో ఆరోగ్య శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు ..తక్షణమే శోభనం ఆపాలని ఆదేశించారు ..

representative image

దీంతో ఒక్కసారిగా జరిగిన పరిణామం చూసి షాక్ కి గురైన కుటుంబ సబ్యులకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు ..తమ ఇంట్లో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ,బయట నుండి కూడా ఎవరూ రాలేదని చెప్పారు .కాగా ఈమధ్య కాలంలోనే వరుడు మంగుళూరు నుండి వచ్చినట్లుగా మాకు సమాచారం అందిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు .మంగుళూరు లో కరోనా కేసు లు అధికంగా ఉన్నాయి .ఆ ప్రాంతం రెడ్ జోన్ గా పరిగణించబడింది ..వరుడు ఆ ప్రాంతం చెందిన వ్యక్తి కావడం వల్ల మీరందరు క్వారంటైన్ లో ఉండాలి అని అధికారులు స్పష్టం చేసారు .శోభనానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి ఈ రాత్రికి మాత్రం వదిలేయండి అని కుటుంబ సభ్యులందరు బ్రతిమాలిన ఆరోగ్య శాఖ అధికారులు వినలేదు…ఈ విషయం సోషల్ మీడియా లో హాల్ చేస్తుంది.


End of Article

You may also like