Home serials కార్తీకదీపం కి గుడ్ బై చెప్పనున్న “మోనిత”..? కొత్త ట్విస్ట్ కి కారణం అదేనా..?

కార్తీకదీపం కి గుడ్ బై చెప్పనున్న “మోనిత”..? కొత్త ట్విస్ట్ కి కారణం అదేనా..?

by Mohana Priya

కార్తీకదీపం సీరియల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ లో ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో హిమని చంపింది మోనిత అని బయటపెట్టేసింది దీప. అంజి కి గన్ గురిపెట్టి హిమని చంపినట్టే నిన్ను చంపేస్తా అని మోనిత అంజిని బెదిరిస్తున్న వీడియో ని డాక్టర్ బాబు కి చూపించింది. డాక్టర్ బాబు మోనిత పాత్రతో మాట్లాడడానికి వెళ్తాడు.Reason behind Shobha Shetty not appearing in Karthika deepam serial

మోనిత తో నిన్ను చంపేస్తా అని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు డాక్టర్ బాబు మోనిత చనిపోయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం మోనిత సీరియల్ లో కనిపించడం లేదు. మోనిత పాత్ర పోషిస్తున్న శోభా శెట్టి కేవలం ఈ సీరియల్ మాత్రమే కాకుండా, కన్నడలో కూడా రుక్కు అనే ఒక సీరియల్ లో నటిస్తున్నారు.Reason behind Shobha Shetty not appearing in Karthika deepam serial

అయితే రెండు సీరియల్స్ షూటింగ్ మేనేజ్ చేసుకోవడం శోభా శెట్టి కి కష్టంగా ఉందట. దాంతో రెండిట్లో ఒక సీరియల్ వదిలేయాలి అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఏ సీరియల్ వదిలేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త ఏంటి అంటే, శోభా శెట్టి కి స్టార్ డం తీసుకొచ్చిన సీరియల్ కార్తీకదీపం.Reason behind Shobha Shetty not appearing in Karthika deepam serial

దాంతో శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్ లో కంటిన్యూ అవుతారట. రుక్కు అనే సీరియల్ వదులుకోవాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శోభా శెట్టి పాత్ర సీరియల్ లో కనిపించకపోవడంతో ప్రేక్షకులు అందరూ “మళ్లీ ఆ పాత్ర ఎంట్రీ ఇస్తారా? లేకపోతే ఇంక శోభా శెట్టి సీరియల్ కి వీడ్కోలు పలికారా?” అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You may also like