Ads
కార్తీకదీపం క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పాత్రలు మనకి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది. అంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంత క్లోజ్ అయిపోయారు అని అర్థం. అందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు. వాళ్ళు ఎక్కడైనా వేరే షోస్ లో కనిపించినా కూడా, వాళ్ళని చూస్తే వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి ఇవే పేర్లు గుర్తుకొస్తున్నాయి. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యారు.
Video Advertisement
గత కొన్ని రోజులుగా డాక్టర్ బాబు పాత్ర పోషిస్తున్న నిరుపమ్ గొంతు మారింది. సాధారణంగా అయితే నిరుపమ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి వేరే గొంతు వినిపిస్తోంది. ఇన్ని సంవత్సరాల నుండి నిరుపమ్ గొంతు విన్న ప్రేక్షకులకి ఈ డబ్బింగ్ వాయిస్ అంత పెద్దగా సూట్ అయినట్టు అనిపించడంలేదు. కార్తీకదీపం సీరియల్ లో మాత్రమే కాకుండా నిరుపమ్ నటిస్తున్న హిట్లర్ గారి పెళ్ళాం, కుంకుమపువ్వు సీరియల్స్ లో కూడా డబ్బింగ్ గొంతే వినిపిస్తోంది.
ఇది ప్రేక్షకులకి అంత పెద్దగా నచ్చడం లేదు. దాంతో నిరుపమ్ సోషల్ మీడియా అకౌంట్ లో నిరుపమ్ వాయిస్ కి ఏమైంది? అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిరుపమ్ కి షూటింగ్, డబ్బింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ తో మరింత బిజీ అయ్యారు నిరుపమ్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో తాను హిమ తల్లిదండ్రులని వెతకడానికి వెళ్తున్నాను అని, తనకోసం వెతకొద్దు అని, వాళ్లు దొరికితేనే ఇంటికి వస్తాను అని, లేకపోతే రాను అని డాక్టర్ బాబు తన తల్లికి ఒక వీడియో మెసేజ్ పెట్టినట్టు చూపించారు. కానీ దీని ద్వారా “నిరుపమ్ సీరియల్ నుండి తప్పుకుంటున్నారు అని మనకు చెప్తున్నారా? అందుకనేనా ఇలా ట్విస్ట్ ఇచ్చారు?” అని ప్రేక్షకులలో ఒక అనుమానం మొదలైంది.
ఇది కరెక్టా? కాదా? నిజంగానే ఇక నుండి డాక్టర్ బాబు పాత్ర మనకి కనిపించదా? మళ్లీ డాక్టర్ బాబు పాత్ర రిటర్న్ అవుతుందా? ఒక వేళ డాక్టర్ బాబు లేకపోతే ఆ పాత్రని ఎవరు రిప్లేస్ చేస్తారు? ఇవన్నీ తెలియాలంటే షో యాజమాన్యం కానీ, లేదా నిరుపమ్ కానీ ఈ విషయంపై స్పందించేంత వరకు ఆగాల్సిందే.
End of Article