ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తున్న షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు ఏదో ఒక .కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. .అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరమైతే అయితే తప్ప బయటకు రావద్దని సామజిక దూరం పాటించమని సెలెబ్రెటీలందరు సోషల్ మీడియా వేదికగా అభిమానాలను కోరుతున్నారు . ఈ నేపథ్యంలో అక్తర్ కూడా గత కొన్ని రోజులుగా ఇటు సోషల్ మీడియా వేదికగా.. అటు టీవీ చానెళ్లలో మాట్లాడుతూ ‘ఇంట్లోనే ఉంటూ భద్రంగా ఉండండి’అని సూచించాడు.

Video Advertisement

లాక్ డౌన్ నిబంధనలు పక్కాగా పాటించాలని ప్రజలకు హితబోధ చేసిన అక్తరే వాటిని అతిక్రమించాడు .ఇప్పుడు ఈ విషయంపై అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు .దీంతో వారు సోషల్ మీడియాలో ఈ ఫాస్ట్ బౌలర్ ను ఒక రేంజ్లో విమర్శిస్తున్నారు .చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మాత్రం చెత్త పనులంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండాల్సిన అక్తర్ ఇస్లామాబాద్ రోడ్లపై సైకిల్ తో రౌండ్లు కొట్టాడు .ఈ ఘనకార్యాన్ని తన స్నేహితుడితో వీడియో తీయుంచుకొని అంతటితో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో ఆ వీడియోని షేర్ చేసి విమర్శల పలు అయ్యాడు .పైగా ఆ వీడియోకు ‘నా అందమైన ఇస్లామాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తున్నా. ఆహ్లాదకరమైన వాతవారణంలో జనసంచారం లేని రోడ్లపై నా బెస్ట్ వర్కౌట్’అని క్యాప్షన్‌గా రాసాడు .

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి ఈ మాజీ పేసర్ పై విమర్శల వర్షం కురిపించారు .అక్తర్ ఒక పక్క ప్రజలు కరొనతో చనిపోతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తావా అయినా ఈ లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి ఎలా వచ్చావ్ .నువ్వు ఒక సెలెబ్రెటీవి… నిన్ను జనాలు అనుసరిస్తారు .ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన నువ్వే ఇలా నిబంధనలను అతిక్రమిస్తావా అంటూ నెటిజన్లు విరుచుకు పడ్డారు .

ఈ నేపథ్యంలో అక్తర్ డై హార్డ్ ఫాన్స్ కూడా ఈ విషయాన్నీ ఖండించారు .’నువ్వు నా అభిమాన క్రికెటర్ .నువ్వు చేసిన ఈ బాధ్యతా రహితమైన చర్యకు బాధపడుతున్నాను .ఇప్పుడు ప్రజలంతా నిన్ను అనుసరించి బయటకు వస్తే దాని వలన కరోనా వ్యాధి ఇంకా ప్రభలం అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు .కరోనా ను వ్యాప్తి చేయాలనీ బావిస్తున్నావా అంటూ ఫైర్ అయ్యారు .’

ఇక అంతక ముందు కరోనా విరాళాల కోసం భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ ఆడితే రెండు దేశాలకు మంచిది అని ,వచ్చిన మనీ రెండు దేశాలు సమానంగా పంచుకోవచ్చని అక్తర్ వెల్లడించాడు. ఈ ప్రతిపాదనపై భారత్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది .భారత్ కు మనీ అవసరం లేదని దాని గురించి ఇలాంటి పరిస్థితులలో క్రికెట్ ఆడాల్సిన కర్మ భారత్ కు పట్టలేదని ఘాటుగా బదులు ఇచ్చారు కపిల్ దేవ్ .అక్తర్ ప్రతిపాదన చాలా హాస్యాస్పదంగా ఉందని ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డాడు. కాగా కపిల్ కామెంట్స్ కు అక్తర్ బదులిస్తూ …తన ఆలోచనను సరిగ్గా అర్ధం చేసుకోలేదని ..త్వరలోనే తన ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందని వెల్లడించారు ..