హీరోయిన్ లేకపోవడంతో షూటింగ్ లకు బ్రేక్…ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది అంటే.?

హీరోయిన్ లేకపోవడంతో షూటింగ్ లకు బ్రేక్…ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది అంటే.?

by Mounika Singaluri

Ads

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీయేస్ట్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల. ప్రస్తుతం అమ్మడు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్టార్ హీరో దగ్గర నుండి యంగ్ హీరో వరకు ప్రతి ఒక్కరు సినిమాలను హీరోయిన్ గా శ్రీ లీల ఉంటుంది. ఈ సంవత్సరం అమ్మడు భగవంత్ కేసరి, స్కంద, ఆది కేశవ సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం అమ్మడి చేతుల్లో గుంటూరు కారం, నితిన్ వెంకీ కుడుముల సినిమా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి.

Video Advertisement

అయితే 2023 సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని శ్రీలీలకు చెడు జ్ఞాపకాలను మిగిల్చాయి. కేవలం భగవంత్ కేసరి సినిమా మాత్రమే ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తుంది. అమ్మడి ఆశలన్నీ ఈ సినిమా మీద పెట్టుకుంది. అయితే ప్రస్తుతం శ్రీ లీల షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేసింది.

దీంతో శ్రీ లీల ఉండే ప్రధాన సీన్లను తరికెక్కించేందుకు సినిమా టీం ఇబ్బందులు పడుతుంది. ఇంతకీ బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ హాలిడే వెకేషన్ కి వెళ్ళలేదు. శ్రీ లీల ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఫైనల్స్ ఎగ్జామ్ రాసేందుకు శ్రీ లీల వెళ్తుంది అందుమూలంగా ఓ వారం రోజులు పాటు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చింది.


End of Article

You may also like