ఆ రోజు రాఖీ పండగ..బస్టాప్ లో నిల్చున్న అమ్మాయిని ఇద్దరు పోకిరీలు ఏడిపిస్తున్నారు..?

ఆ రోజు రాఖీ పండగ..బస్టాప్ లో నిల్చున్న అమ్మాయిని ఇద్దరు పోకిరీలు ఏడిపిస్తున్నారు..?

by Mohana Priya

Ads

ఆ రోజు రాఖీ పండగ. ఒక అమ్మాయి తన అన్నయ్యకు రాఖీ కట్టడానికి బయలుదేరింది. బస్ కోసం బస్ స్టాప్ లో ఎదురుచూస్తోంది. అప్పుడే తన అన్నయ్య నుండి ఎక్కడ ఉన్నావు అని ఫోన్ వచ్చింది. బస్ కోసం చూస్తున్నాను. తొందరగా వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది చెల్లెలు. ఆ అమ్మాయి వెనకాల ఇద్దరు అబ్బాయిలు నిల్చుని ఉన్నారు.

Video Advertisement

ఆ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని చూసి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అవి వింటున్న అమ్మాయికి కోపం వచ్చినా కూడా ఏం అనలేకపోయింది. వాళ్లు ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న బస్టాప్ లో ఉన్న మరొక వ్యక్తి ఆ ఇద్దరు అబ్బాయిల దగ్గరికి వచ్చాడు.

ఇద్దరు అబ్బాయిల లో ఒక అబ్బాయి చేతికి రాఖీ ఉంది. ఈ రాఖీ కట్టింది ఎవరు అని అడిగాడు? దానికి అతను ” నా చెల్లెలు. ఏం చేస్తావ్ ఇప్పుడు?” అని దురుసుగా సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ మూడవ వ్యక్తి ఆ ఇద్దరు అబ్బాయిల లో రాఖీ కట్టుకుని ఉన్న వ్యక్తి సోదరి గురించి ఇందాక వాళ్లు ఆ అమ్మాయిని అన్న మాటే అన్నాడు.

తన చెల్లెలిని అలా అన్నందుకు కోపం వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకతను మూడవ వ్యక్తిని మీదకి చెయ్యి ఎత్తుతాడు. అప్పుడు మూడవ వ్యక్తి ” నీ చెల్లెల్ని అన్నందుకు నీకు కోపం వచ్చినట్టే నా చెల్లెలిని అంటే నాకు కూడా కోపం వస్తుంది. అక్కడ నిల్చున్నది నా చెల్లి” అని చెప్తాడు. దానికి ఇద్దరు వ్యక్తులు మూడవ వ్యక్తి కి సారీ చెప్తారు.

అప్పుడు ఆ మూడవ వ్యక్తి సారీ తనకి కాదు తన చెల్లెలికి చెప్పమని చెప్తాడు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి కి సారీ చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను కాపాడినందుకు థాంక్స్ అని చెబుతుంది. అంతే కాకుండా తన కోసం కొన్న రాఖి ఇతనికి ఇస్తుంది.

ఇదంతా భాయ్ హో తో ఐసా అనే షార్ట్ ఫిలిం లో జరిగిన కథ. కానీ ఈ షార్ట్ ఫిలిం మీరట్ లో జరిగిన ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా తీశారు. వేద్ మిత్ర చౌదరి అనే సైనికుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న వాళ్లతో పోరాడి ఆ అమ్మాయి ని కాపాడి తన జీవితాన్ని త్యాగం చేశారు. ఒకరిని కాపాడటానికి తన అన్న లేదా తమ్ముడు అవ్వాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళని గౌరవించడం మన బాధ్యత అని అర్థం చేసుకున్న వ్యక్తి అయితే చాలు అని నిరూపించారు వేద్ మిత్ర చౌదరి.

watch video:

 


End of Article

You may also like