అలా రాసేవారికి ఇదే చివరి వార్నింగ్ …లేదంటే లీగల్ ఆక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.!

అలా రాసేవారికి ఇదే చివరి వార్నింగ్ …లేదంటే లీగల్ ఆక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.!

by Megha Varna

Ads

తెలుగులో భారీ వ్యయంతో మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ భారీ హిట్ అయ్యింది.దానితో బిగ్ బాస్ ఎడ తెడపి లేకుండా విజయవంతంగా మరో రెండు సీజన్ లు పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగవ సీజన్ ద్వారా త్వరలో జనాల ముందుకి రాబోతుంది.ఈ సీజన్ లో ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్ ల లిస్ట్ బిగ్ బాస్ యాజమాన్యం బయటపెట్టలేదు.దీనితో కొందరు ఔత్సాహికులు బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ వీళ్ళే అంటూ ఓ లిస్ట్ ను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు,చేస్తున్నారు.

Video Advertisement

ఇక ఈ లిస్ట్ లో ఉన్న తరుణ్ తనకి బిగ్ బాస్ అంటే ఇంటరెస్ట్ లేదని చెప్పడంతో తను బిగ్ బాస్ 4లో కనిపించట్లేదన్న విషయం స్పష్టం అయిపోయింది.ఇక శ్రద్ధ దాస్ తన పై వస్తున్న రూమర్స్ డోస్ పెరగడంతో తనే స్వయంగా స్పందించింది.తనని బిగ్ బాస్ నుండి ఎవరూ సంప్రదించలేదని.అలాగే ఈ అంశం పై నన్ను బోలెడు మంది ప్రశ్నలు అడుగుతున్నారు.వారందరి కోసం నేను ట్వీట్ చేస్తున్నాను.

నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు కథనాలు రాసేవారు ఇకనైనా ఇలాంటి కథనాలు ఆపండి.లేకుంటే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇక ఈ ట్వీట్ తో ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 4 లో కనిపించట్లేదని క్లారిటీ వచ్చేసింది.దీనితో అసలు
బిగ్ బాస్ 4 లో ఎవరూ ఉంటారు అనే చర్చ ఒకపక్క జరుగుతుంటే! అసలు కరోనా టైంలో బిగ్ బాస్ ను ఎలా నిర్వహిస్తారో ఏం చేస్తారో టాస్క్ ల విషయంలో అంటూ మరోవైపు జరుగుతుంది.


End of Article

You may also like