శ్రియ నిజంగా అన్ని కష్టాల్లో ఉందా..? మీడియాలో అలా…ఆమె కామెంట్స్ లో ఇలా..?

శ్రియ నిజంగా అన్ని కష్టాల్లో ఉందా..? మీడియాలో అలా…ఆమె కామెంట్స్ లో ఇలా..?

by Sainath Gopi

Ads

2018లో బార్సిలోనా టెన్నిస్‌ప్లేయర్‌ ఆండ్రూను మ్యారేజ్ చేసుకున్న తర్వాత శ్రియ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రియ భర్త ఆండ్రీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్రియ మీడియాకు తెలిపారు.తన భర్త పొడి దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతూ ఉన్నారని, ముందు జాగ్రత్తగా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి, ప్రత్యేక గదిలో ఉంటున్నాడని చెప్పింది. తన భర్తలో ఈ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యానని పేర్కొంది.

Video Advertisement

ఇటీవల లాక్‌డౌన్ వేళ తన భర్త అండ్రీ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌చేస్తూ.. శ్రియ ఈ ఛాలెంజ్‌ను(బార్తన్‌సాఫ్‌కరో) స్వీకరించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, తమిళ యంగ్ హీరో ఆర్యలతో పాటు పలువురిని నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటె…మీడియాలో శ్రియ చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంది..తన భర్తకి విషమం అన్నట్టు కొందరు వార్తలు రాస్తున్నారు. కానీ శ్రియ తన ఇంస్టాగ్రామ్లో తన భర్త ఇప్పుడు బాగానే ఉన్నారని తెలిపింది. తన భర్త బర్త్ డే సందర్బంగా పోస్ట్ పెట్టింది. కామెంట్స్ లో ఒకరు తన భర్తకి కరోనా అంట కదా అని అడగగా…అది పోయిన నెల సంగతి. ఇప్పుడు బాగానే ఉన్నారు అని తెలిపింది.

 

శ్రియ చాలా కష్టాల్లో ఉంది…తన కాపురంలో కరోనా చిచ్చు పెట్టింది అన్నట్టు శ్రియ కంటతడి పెట్టుకున్న ఫోటో పెట్టి షేర్ చేస్తున్నారు. శ్రియ కామెంట్స్ లో మాత్రం తన అభిమానులు మీ భర్త గురించి ఇంకా అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీడియాలో మాత్రం ఎందుకు అలా రాస్తున్నారు? నెల కింద జరిగింది ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు?


End of Article

You may also like