Home Filmy Adda Shruti Haasan : శృతి హాసన్ గతంలో రిలేషన్ షిప్ లో ఉన్న ఆ ప్రముఖ “స్టార్ ఫ్యామిలీ” హీరో ఎవరో తెలుసా..?

Shruti Haasan : శృతి హాసన్ గతంలో రిలేషన్ షిప్ లో ఉన్న ఆ ప్రముఖ “స్టార్ ఫ్యామిలీ” హీరో ఎవరో తెలుసా..?

by Mohana Priya

కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ నుండి గ్యాప్ తీసుకొని మళ్లీ ఇటీవల క్రాక్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన నటి శృతి హాసన్. ఆ తర్వాత నుండి వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి కూడా శృతి హాసన్ హీరోయిన్ గా సైన్ చేశారు.

అలాగే ప్రభాస్ తో పాటు సలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు. శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాల గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. అలా తను ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న సంగతి సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పకనే చెప్పారు శృతి హాసన్. అయితే, శృతి హాసన్ అంతకు ముందు ఒక ప్రముఖ స్టార్ కుటుంబానికి చెందిన హీరోతో రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి.

Shruti Haasan dated this star family hero

అది కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోనే కావడం చర్చనీయాంశం అయింది. అతనెవరో కాదు, అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య, శృతి హాసన్ కలిసి ప్రేమమ్ సినిమాలో నటించారు. కానీ 2013లో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారట. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత ఈ వార్త చాలా రోజుల వరకు చర్చలో నిలిచింది.

You may also like