కరోనా మహమ్మారి రోజురోజుకి విజృభించడంతో చేసేది ఏమిలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దేశమంతట పూర్తి లాక్ డౌన్ విదించిన విషయం తెలిసిందే . ఎవరు కూడ అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి ఎవరు బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది . దింతో చిన్న పెద్ద సామాన్య ప్రజలు సెలెబ్రెటీలు అనే తేడా లేకుండా అందరు ఇంటికే పరిమితం అయ్యారు . కరోనా వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తుంటే దానికంటే ఎక్కువగా సోషల్ మీడియా లో టైం స్పెండ్ చేస్తున్నారు జనాలు.

Video Advertisement

హీరో కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచమైనప్పటికీ తాను చేసిన వైవిధ్యమైన చిత్రాల వలన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అతి కొద్దీ కాలంలోనే తండ్రికి తగ్గ  తనయురాలు అనిపించుకుంటున్నారు శృతి హాసన్ .ఎప్పుడు సామజిక సాయంలో ముందుండే శృతి హాసన్ ను ఇప్పుడు నెటిజన్లు అందరు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారంట..ఎలాగైనా బోధిధర్మ ను మళ్ళి తీసుకువచ్చి కరోనా ను తరిమికొట్టాలి అని అడుగుతున్నారంట.

విభిన్న కథ చిత్రాల సంచలన దర్శకుడు ఏఆర్ మురగదాస్ , సూర్య కాంబినేషన్ లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ సేవెన్త్ సెన్స్ వచ్చిన విషయం తెలిసిందే . ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ముందు చతికిల పడింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి . అప్పట్లో ఈ సినిమా గురించి తెలియని గొప్పతనం గురించి ఇప్పుడు అందరు మురగదాస్ ఐడియాలజీ గురించి ప్రశంసల  వర్షం కురిపిస్తున్నారు .

ఈ చిత్రంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి మన జీవినం విధానం గురించి చెప్తూ పసుపు వాడడం ఇంటి ముందు కళ్లపు జల్లడం మన సంస్కృతి అని చెప్పకండి సైన్స్ అని చెప్పండి .పసుపు ఏంటి బేక్టీరియల్ అని కళ్లపు జల్లితే క్రిమి కీటకాలు లోపాలకి రావని చెప్పండి అని ఇంకా మన భారతీయుల గొప్పతనం గురించి మన మూలాల గురించి ప్రస్తావించారు. సేవెన్త్ సెన్స్ చిత్రంలో   చైనీయులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పింది మన భారతీయుడైన బోధిధర్మ అని మన భారతీయులకే సరిగ్గా తెలియని బోధిధర్మ గురించి చెప్తారు ఈ చిత్రంలో .

చైనా లో మొదలైన వైరస్ కారణంగా  భారత్ లో విపరీతమైన జననష్టం కలుగుతుంది .ఆ వైరస్ పోవాలంటే వందేళ్ల క్రిందటి బోధిధర్మ ను తీసుకురావడమే ఏకైక మార్గమని జెనిటిక్ రీసెర్చేర్ అయినా శృతి హాసన్ తెలుసుకొని బోధిధర్మ డిఎన్ఏ నుండి వచ్చిన వంశస్తుల కోసం వెతికి హీరోని పట్టుకొని జన్యు పరిణామక్రమం జరిపి వందేళ్ల క్రిందటి బోధిధర్మ ను తీసుకువస్తుంది . అతను మందు తయారుచేసి వైరస్ ను అంతమొందిస్తాడు ..

ఆ సినిమాలో చూపించినట్టుగానే తాజాగా దేశంలో అలంటి పరిస్థితులే నెలకొన్నాయి ..చైనా లో మొదలైన కరోనా వైరస్ కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి ..దాంతో బోధిధర్మను మళ్ళి తీసుకువచ్చి ఈ కరోనా మహమ్మారి ని అంతం చెయ్యాలని ప్లీజ్ ఎలాగైనా బోధిధర్మ ను పిలిపించు అని నెటిజన్లు శృతికి మెసేజ్ చేస్తున్నారంట .. సోషల్ మీడియా ద్వారా శ్రుతి ఈ విషయాన్ని వెల్లడించింది.