Home Filmy Adda “ఇంత అందమైన ముఖాన్ని ఎందుకు అలా చేసుకున్నావు.?” అనే కామెంట్స్ కి శృతి హాసన్ షాకింగ్ రిప్లై..!

“ఇంత అందమైన ముఖాన్ని ఎందుకు అలా చేసుకున్నావు.?” అనే కామెంట్స్ కి శృతి హాసన్ షాకింగ్ రిప్లై..!

by Mohana Priya

తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించి, మధ్యలో కొంత విరామం తీసుకొని క్రాక్ సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన స్టార్ నటి శృతి హాసన్. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించారు. శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రోజు ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా శృతి హాసన్ నెటిజన్స్ తో షేర్ చేసుకుంటారు.

Shruti Hassan reply to the netizens comments on her face

అంతే కాకుండా తన ఫాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా శృతి హాసన్ సమాధానాలు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో శృతి హాసన్ ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో శృతి హాసన్ ముఖం మీద టాటూ వేయించుకున్నారు. అది ఒరిజినల్ కాదు. ఏదో టెంపరరీగా స్కెచ్ వేసింది అని చూస్తుంటే అర్థమవుతోంది. అయితే, ఈ ఫోటోను చూసిన చాలా మంది “ఇంత అందమైన ముఖాన్ని ఎందుకు అలా చేసుకున్నావు?” అని అడుగుతున్నారు.

Shruti Hassan reply to the netizens comments on her face

ఇది మాత్రమే కాకుండా శృతి హాసన్ కి శరీరంపై కొన్ని టాటూలు ఉంటాయి. అంతే కాకుండా కాస్మెటిక్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనే వెల్లడించారు. అయితే ఇప్పుడు శృతి హాసన్ మళ్ళీ టాటూ ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా అంతట ఆ ఫోటో వైరల్ అయ్యి, నెగటివ్ కామెంట్స్ కి దారితీసింది. దాంతో శృతి హాసన్ ఈ విధంగా స్పందించారు.

Shruti Hassan reply to the netizens comments on her face

“నీకు టాటూస్ అంటే ఎందుకు అంత ఇష్టం? నువ్వు ఎందుకు వింతగా ఉన్నావు? అంత అందమైన ముఖానికి GOTH మేకప్ వేసి ఎందుకు అలా చేసుకున్నావు? అని అడిగేవారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే” అని పోస్ట్ చేసి, నెక్స్ట్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో, కమల్ హాసన్ హీరోగా నటించిన అభయ్ సినిమాలో ఫోటో పోస్ట్ చేసి, “ఇదంతా నాకు మా నాన్న నుండి వచ్చింది” అని సరదాగా కామెంట్ చేశారు శృతి హాసన్. శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

You may also like