పిఠాపురం రిజల్ట్స్ గురించి చెప్పిన శ్యామల..! “ఆయన సహాయ పడడం చూడలేదు..!” అంటూ..?

పిఠాపురం రిజల్ట్స్ గురించి చెప్పిన శ్యామల..! “ఆయన సహాయ పడడం చూడలేదు..!” అంటూ..?

by Harika

Ads

యాంకర్ గా రాణిస్తూ, మరొక పక్కన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల. శ్యామల మొదట సినిమాల్లోనే చేశారు. ఆ తర్వాత యాంకరింగ్ మొదలుపెట్టారు. సీరియల్స్ కూడా చేశారు. సీరియల్స్ తో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. యాంకర్ గా ఆ గుర్తింపు ఇంకా పెరిగింది. ఎన్నో షోస్ లో శ్యామల యాంకరింగ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈస్ట్ గోదావరి లోని, కాకినాడలో శ్యామల పుట్టారు. ఎన్నో సినిమాల్లో నటించారు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత యాంకరింగ్ లో స్టార్ యాంకర్ గా ఎదిగారు.

Video Advertisement

shyamala about pithapuram results

బిగ్ బాస్ ప్రోగ్రాం లో కూడా కంటెస్టెంట్ గా వెళ్లారు. బిగ్ బాస్ నుండి వచ్చాక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. దాంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా శ్యామల పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాలో శ్యామల ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇంకా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు. శ్యామల ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీ తరపున శ్యామల రాజకీయాల్లో నిలబడ్డారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్యామల పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే విషయం గురించి మాట్లాడారు. శ్యామల ఈ విషయం మీద మాట్లాడుతూ, “పిఠాపురంలో గెలిచేది వంగా గీత గారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు. ఇదే విషయాన్ని 4వ తారీకు మాట్లాడుకుందాం” అని అన్నారు.

అప్పుడు యాంకర్, “సర్వేలు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్తున్నాయి” అనడంతో. శ్యామల, “సర్వేలు చెప్తున్న మాట. రిజల్ట్స్ కాదు కదా. 4వ తారీకు తెలుస్తుంది కదా. ఒకటే మాట చెప్తాను. రాజకీయాలు అంటే, ఆవేశపడడం కాదు. రాజకీయాలు అంటే అరవడం కాదు. రాజకీయాలు అంటే సహాయం చేయడం అనేది నేను నమ్ముతాను. నేను ఇప్పటి వరకు ఆయనని ఆవేశపడడం చూశాను. పొలిటికల్ గా చెప్పాలి అంటే, స్టేజ్ మీద చాలా మాట్లాడుతారు కాబట్టి ఆయాసపడడం చూశాను. ఎప్పుడూ నేను సహాయం చేసింది అయితే నేనైతే ఎక్కడా చూడలేదు” అని చెప్పారు శ్యామల.

watch video :


End of Article

You may also like