ముగ్గురు వ్యక్తులు 10 సంవత్సరాల పాటు తమని తాము ఒక గదిలో బంధించుకొని ఉన్నారు. డిసెంబర్ 27 వ తేదీన అక్కడి ఎన్జీవో వాళ్లు, ఆ ముగ్గురిని బయటికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే. ద హిందూ కథనం ప్రకారం, గుజరాత్ లోని రాజ్కోట్ కి చెందిన నవీన్ మెహతా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన భార్య కొన్ని సంవత్సరాలు అనారోగ్యంతో బాధ పడి తర్వాత మరణించారు.

siblings locked in a room for ten years

తల్లి మరణాన్ని తట్టుకోలేని వారి పిల్లలు అమ్రీష్ మెహతా, భావేష్ మెహతా, మేఘన మెహతా, ఒక రూమ్ లో ఉండిపోయారు. తండ్రి నవీన్ భోజనం పార్సిల్ తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. నవీన్ సహాయంతో సాథీ సేవా గ్రూప్ అనే ఎన్జీవో వాళ్లు గది తలుపులు బద్దలుకొట్టి వారి ముగ్గురిని బయటికి తీసుకువచ్చారు.

siblings locked in a room for ten years

అమ్రీష్, భావేష్ కి గడ్డాలు దాదాపు నడుము వరకు పెరిగిపోయాయి. రూమ్ అంతా ఒక రకమైన వాసన వచ్చింది. దుస్తులు కూడా సరిగ్గా లేవు. షేవింగ్ కూడా లేదు. వాళ్ళని బయటికి తీసుకువచ్చిన తర్వాత వాలంటీర్లు బార్బర్స్ ని పిలిపించి అమ్రీష్, భావేష్ కి షేవింగ్ కటింగ్ చేయించారు. అలాగే దుస్తులను కూడా ఇచ్చారు.

siblings locked in a room for ten years

siblings locked in a room for ten years

ఈ విషయంపై నవీన్ మాట్లాడుతూ “నా పెద్ద కొడుకు 42 సంవత్సరాల అమ్రీష్ మెహతా బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీ పొంది లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 39 సంవత్సరాల మేఘన మెహతా సైకాలజీలో ఎమ్ ఏ చేశారు. భావేష్ మెహతా ఎకనామిక్స్ లో బిఏ చేశారు. భావేష్ మంచి క్రికెటర్ కూడా.

1986 లో నుండి వారి తల్లికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. వారి తల్లి మరణించిన తర్వాత ముగ్గురు తమని తాము ఒక గదిలో బంధించుకొని బయట ప్రపంచానికి దూరమయ్యారు.” అని అన్నారు. వారి ముగ్గురిపై బంధువులు చేతబడి చేశారు అని తనకి చుట్టుపక్కల వాళ్ళు, అలాగే కొంత మంది బంధువులు చెప్పారని నవీన్ పేర్కొన్నారు.