Siddharth : “మీరు చూపించిన దయకి నాకు చాలా సంతోషంగా అనిపించింది.!” అంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్.!

Siddharth : “మీరు చూపించిన దయకి నాకు చాలా సంతోషంగా అనిపించింది.!” అంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్.!

by Mohana Priya

Ads

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన మహా సముద్రం ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకి దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్ పాల్గొనలేదు.

Video Advertisement

ఇన్ని సంవత్సరాలు అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో సిద్ధార్థ్ కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈవెంట్ కి సిద్ధార్థ్ రాకపోవడంతో చాలా మంది “సిద్ధార్థ్ ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సిద్ధార్థ్ ఏదో ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. దాంతో అభిమానులు అందరూ ఆందోళనకు గురయ్యారు.

ఇవాళ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేసి, మహా సముద్రం డబ్బింగ్ పూర్తి అయినట్టు, అలాగే తన దెబ్బ గురించి కూడా చెప్పారు. వెన్నెముకకి దెబ్బ తగిలింది అని, దాని సర్జరీ కోసం వెళ్ళాను అని చెప్పారు. అలాగే “మేము అందరం కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో కలిసి చూడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూపించిన ప్రేమకి నాకు చాలా సంతోషంగా అనిపించింది” అని పోస్ట్ షేర్ చేశారు సిద్ధార్థ్.


End of Article

You may also like