Ads
అటు తమిళ్ సినిమాల్లో, ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్. ఇటీవల మహాసముద్రం సినిమాతో తెలుగు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తమిళ్ సినిమా అయిన టక్కర్ తెలుగు డబ్బింగ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : టక్కర్
- నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్.
- నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
- దర్శకత్వం : కార్తీక్ జి క్రిష్
- సంగీతం : నివాస్ కే ప్రసన్న
- విడుదల తేదీ : జూన్ 9, 2023
స్టోరీ :
ఒక డబ్బు లేని వాడు (సిద్ధార్థ్) బాగా డబ్బులు సంపాదించాలి అని కలలు కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి అతను ఎలాంటి పనులు చేశాడు అనేది ఈ సినిమా కథ. అతను చేసే కొన్ని పనుల వల్ల అతనికి తెలియకుండానే కొన్ని నేరాలు చేసే ఒక గ్యాంగ్ తో గొడవల్లో ఇరుక్కుంటాడు. అలాగే అతనికి మధ్యలో బాగా డబ్బున్న ఒక అమ్మాయి (దివ్యాంశ కౌశిక్) ఎదురు పడుతుంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి డబ్బులు సంపాదించాడా? అతని కలలు నిజం చేసుకున్నాడా? మధ్యలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అతను వాటిని ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ప్రతి సినిమాకి కథనంలో కొత్తదనం ఉండడంతో పాటు, తనని తాను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకోవడానికి తపనపడే నటుడు సిద్ధార్థ్. ఒక సమయంలో వరుసగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు. తర్వాత చేసే సినిమాలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, చాలా డిఫరెంట్ గా ఉండే సబ్జెక్ట్ సినిమాలని మాత్రమే చేస్తున్నారు.
ఫలితం ఎలా ఉన్నా కూడా సిద్ధార్థ్ మాత్రం ప్రయోగాత్మక సినిమాలకి ఎప్పుడూ ప్రోత్సాహంగానే నిలుస్తున్నారు. అందుకే తన వంతు ప్రయత్నంగా ఆ సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా సిద్ధార్థ్ అంతకుముందు నటించిన సినిమాలకి పోలిక లేకుండానే ఉంది.
కానీ ఆ సినిమాలతో పోలిస్తే ఇది చాలా బలహీనంగా ఉంది. సిద్ధార్థ్ లుక్, స్టైల్ ఈ సినిమాలో కొత్తగా ఉన్నాయి. మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా సన్నగా కూడా కనిపించారు. కానీ అవి ఏమీ కూడా సినిమాని ఎలివేట్ చేయడానికి ప్లస్ పాయింట్ అవ్వలేదు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధార్థ్ తన పాత్రకి తగ్గట్టుగా చేశారు. అంత గొప్ప నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కూడా కాదు ఇది.
ఇంక హీరోయిన్ దివ్యాంశ విషయానికి వస్తే నటనపరంగా అంత చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. కానీ తెరపై కాస్త గ్లామరస్ గా కనిపించారు అంతే. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గా ఉంది. ఒకవేళ సినిమా పాయింట్ సింపుల్ గా ఉన్నా కూడా తెరపై బాగా చూపిస్తే ప్రేక్షకులు చూస్తారు. కానీ ఇక్కడ అది కూడా లేదు. సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ అవి ఏమీ కూడా సినిమా ముందుకు వెళ్లడానికి సహాయం చేయవు.
పాటలు కూడా అంత గుర్తుపెట్టుకోదగ్గ గొప్పగా ఏమీ లేవు. లవ్ స్టోరీ, యాక్షన్ అన్నీ కలిపి ఒకే సినిమాలో చూపించాలి అనుకోవడం డైరెక్టర్ చేసిన పొరపాటు ఏమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక పాయింట్ మీద నడిస్తే కనీసం ఒక్కసారి అయినా చూడగలిగే సినిమాగా నిలిచేది ఏమో అని అనిపిస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే లాగానే ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- కొంతవరకు ఫస్ట్ హాఫ్
- యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్
- బలహీనమైన కథనం
- లవ్ స్టోరీ
- నవ్వు తెప్పించని కామెడీ
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
కేవలం సిద్ధార్థ్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారు మాత్రమే ఈ సినిమాని ఒక్కసారి అయినా చూడగలుగుతారు. లేకపోతే కథ కోసం, డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం సినిమా చూద్దాం అని అనుకుంటే మాత్రం టక్కర్ సినిమా ప్రేక్షకులకి నచ్చే అవకాశం అస్సలు లేని సినిమా అవుతుంది.
watch trailer :
End of Article