Ads
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న SR కళ్యాణమండపం సినిమాలో నుంచి మూడో పాట అయిన సిగ్గు ఎందుకు రా మామా లిరికల్ వీడియో ఇవాళ విడుదలయ్యింది. ఈ పాటని చైతన్ భరద్వాజ్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి పాడారు. భాస్కర భట్ల గారు లిరిక్స్ అందించారు. SR కళ్యాణమండపం సినిమా టీజర్ కొన్ని నెలల క్రితం విడుదల అయ్యింది. ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.
Video Advertisement
ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్ గారు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం అంతకుముందు రాజా వారు రాణి వారు సినిమాలో హీరోగా నటించారు. ప్రియాంక జవాల్కర్ ఎన్నో షార్ట్ ఫిలింస్ లో నటించడంతో పాటు, టాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో ఇంతకు ముందు విడుదలైన రెండు పాటల లిరికల్ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. SR కళ్యాణమండపం సినిమా థియేటర్లలోనే విడుదల అవుతోంది అని సమాచారం. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
watch video :
End of Article