AYODHYA: అయోధ్య రామ మందిరానికి వెండి చీపురు కానుక ఇచ్చిన ఈయన ఎవరో తెలుసా.?

AYODHYA: అయోధ్య రామ మందిరానికి వెండి చీపురు కానుక ఇచ్చిన ఈయన ఎవరో తెలుసా.?

by Mounika Singaluri

Ads

హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్టు భక్తులను విరాళాలు కోరింది. ఈ అద్భుతమైన రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు ఇచ్చారు.

Video Advertisement

ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారిలో ఉన్నారు. తాజాగా- అఖిల భారతీయ మాంగ్ సమాజ్ భక్తులు రామ మందిరానికి చీపురును కానుకగా సమర్పించారు. వెండితో తయారు చేసిన ఈ చీపురును 1.751 కేజీల వెండితో తయారు చేశారు.ప్రదర్శనగా ఈ వెండి చీపురును అయోధ్యకు తీసుకొచ్చి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో బాల రాముడి గర్భాలయాన్ని ఈ వెండి చీపురుతో శుభ్రం చేయాలని కోరారు.

ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో స్వామి వారి దర్శనాలు ప్రారంభం అయ్యి 11:30 గంటలకు ముగుస్తున్నాయి. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శన కాలం ఉంటుంది. ప్రతి రోజు తెల్లవారు జామున 6:30 గంటలకు జాగరణ్ హారతి ఇస్తారు.ఇక మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో ఆలయ తలుపులను మూసివేస్తారు.


End of Article

You may also like