Ads
ప్రముఖ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో పాపులర్ పాటలను చిన్మయి పాడారు. తన పాటలకు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. చిన్మయి ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సమంత కి ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు.
Video Advertisement
సమంత కి మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లకు చిన్మయి తెలుగు తమిళ్ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. చిన్మయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఎన్నో విషయాలపై చిన్మయి నెటిజన్లకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది నెటిజన్లు అడిగే ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్తూ ఉంటారు. అయితే చిన్మయి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కి సమాధానం ఇచ్చారు. ఒక ఫేస్ బుక్ పేజ్ లో, దిశ నిందితులలో ఒకరైన వ్యక్తి భార్య గురించి చెప్తూ పోస్ట్ వేశారు. ఈ పోస్ట్ లో చిన్మయిని ట్యాగ్ చేశారు. ఆమెకి హెల్ప్ చేయాలి అంటూ, అప్పుడే ఫెమినిస్ట్ అవుతారు అంటూ ఆ పోస్ట్ లో రాశారు. అందుకు చిన్మయి స్పందించారు.
చిన్మయి ఈ విధంగా రాశారు. “నేను రేపిస్ట్ గురించి, హింసించే వారి గురించి మాట్లాడితే మగాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఫేక్ ఫెమినిస్ట్ అని ఏడ్చింది మీరే అండి. నేను స్పెసిఫిక్ గా హింసించే వారి గురించి, రేపిస్ట్ గురించి, అలాగే కట్నం తీసుకునే వారి గురించి మాట్లాడతా. వారిలో చుట్టూ ఉన్నవారు కూడా ఉండొచ్చు. ఆడపడుచు కట్నం అనేది స్పెసిఫిక్ గా మన తెలుగు సంప్రదాయంలోనే ఉన్న ఒక దారుణమైన కల్చర్ ప్రాక్టీస్. భారతదేశంలో ఎవరు ఆడపడుచు కట్నం డిమాండ్ చేయరు. మీ భర్త, మీ సోదరులు, మీ తాతలు మా ఇంట్లో ఉన్నారా? ఎప్పటినుంచి అండి? మీ కుటుంబానికి సంబంధించిన వారు ఎవరు మా ఇంట్లో లేరు. లేకపోతే మా ఇంట్లో ఉన్న పిల్లలు మీలాగా తయారవుతారు” అని చిన్మయి రాశారు.
End of Article