“బిగ్ బాస్ – 4 ” లో “సింగర్ సునీత”? ఏమని క్లారిటీ ఇచ్చారంటే?

“బిగ్ బాస్ – 4 ” లో “సింగర్ సునీత”? ఏమని క్లారిటీ ఇచ్చారంటే?

by Megha Varna

Ads

ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైనవి కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఎడారిలో ఒక్క చినుకు వర్షం పడినట్టు సడన్ గా ఇటీవల మా టీవీ యాజమాన్యం బిగ్ బాస్ ఫోర్ ప్రోమో విడుదల చేసింది.

Video Advertisement

అసలు మామూలుగానే బిగ్ బాస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇలాంటి సమయంలో షో స్టార్ట్ అయితే ఇంక టి ఆర్ పి ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. గత సీజన్ లో తన హోస్టింగ్ తో అలరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వారం వారం కంటెస్టెంట్ ల పనిపట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ లు వీరే అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్న కొంత మంది సెలబ్రిటీలు స్పందించి వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని చెప్పారు. తర్వాత కూడా ఎంతో మంది పేర్లు వినిపించడం మళ్లీ వాళ్లు అసలు ఆ వార్తలన్నీ పుకార్లు అని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ అని కొంత మంది సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ లిస్ట్ లో అమ్మ రాజశేఖర్, యాంకర్ లాస్య, మెహబూబ్ దిల్ సే, దేవి నాగవల్లి – యాంకర్, నోయల్ – సింగర్, జబర్దస్త్ అవినాష్, కరాటే కళ్యాణి, గంగవ్వ, సుజాత – యాంకర్, మోనాల్ గజ్జర్, అరియనా గ్లోరీ , సయ్యద్ సోహెల్, అలేఖ్య హారిక, అభిజిత్ పేర్లు వినిపించాయి.

అయితే సింగర్ సునీత గారు కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారు అనే వార్త కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై సింగర్ సునీత క్లారిటీ ఇచ్చారు. Dear friends, I am not in the “Biggboss 4 Telugu”nor I will be ?? FYI అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి తాను వెళ్లట్లేదు అని క్లారిటీ ఇచ్చారు.


End of Article

You may also like