Ads
తెలుగు లో ప్రముఖ గాయని సునీత గారి నిశ్చితార్థం ఈ రోజు ఉదయం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై మీడియాలో చాలానే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పడింది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరప్పనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిశ్చితార్థం కి సంభందించిన ఫోటోలను సునీత తన ఫేస్బుక్ లో అభిమానులతో పంచుకున్నారు.
Video Advertisement
ప్రతి తల్లిలాగే నా పిల్లలు బాగా స్థిరపడాలని నేను కలలు కంటున్నాను. అదే సమయంలో నేను కూడా జీవితంలో స్థిరపడాలని చూడాలనుకునే నా పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందకు సంతోషపడుతున్నాను. రామ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన స్నేహితుడిగానే, ఓ అద్భుతమైన భాగస్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్దరం త్వరలో వివాహం చేసుకోబుతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచాలని చూస్తాను.. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటూ సునీత పోస్ట్ చేసారు.
watch video:
End of Article