“ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి..!” వైరల్ అవుతున్న సింగర్ “సునీత” కామెంట్..!

“ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి..!” వైరల్ అవుతున్న సింగర్ “సునీత” కామెంట్..!

by Mohana Priya

Ads

సింగర్ సునీత అంటే.. కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పాటకు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో లెక్కలేదు. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా.. ఒంటరిగా తన సమస్యలను తాను సాల్వ్ చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇటీవలే.. రామ్ తో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Video Advertisement

ఆమె పట్ల విమర్శలు చేసే వారి సంగతి ఎలా ఉన్నా.. ఆమెను అభిమానించే వారికి మాత్రం కొదవ లేదు. చాలా మంది ఆమె ను చూసి ఇన్స్పైర్ అయ్యే వారు కూడా ఉన్నారు. అయితే సునీత ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో సునీత తన భర్త రామ్ తో కలిసి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం దగ్గరికి వెళ్ళారు.

ఈ ఫోటోకి ఒక నెటిజన్ “కాకి ముక్కుకు దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం ధనము ఆయన సొంతం! గానం ఈవిడది దర్జా అతనిది!” అని కామెంట్ చేశారు. అందుకు సునీత, “నోటి దూల నీది. నీ భారం భూమిది” అని రిప్లై ఇచ్చారు. తర్వాత ఆ నెటిజన్ పై కామెంట్స్ లో చాలా మంది ఫైర్ అయ్యారు.

singer sunitha reply to a netizen

ఈ క్రమంలో సునీత మళ్లీ స్పందిస్తూ, ” మై డియర్ ఫ్రెండ్స్ .. నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికి ఋణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది వున్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే వున్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం. ఇలాంటి దిక్కుమాలిన బుద్ధి ఉన్న వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి” అని రాశారు. దాంతో చాలా మంది నెటిజన్లు సునీత సరైన విధంగా మాట్లాడారు అని కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like