“అందరి ముందు దాని గురించి ఎందుకు మాట్లాడావ్..?” అంటూ… “తల్లి” పై ఫైర్ అయిన సిరి..!

“అందరి ముందు దాని గురించి ఎందుకు మాట్లాడావ్..?” అంటూ… “తల్లి” పై ఫైర్ అయిన సిరి..!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 81 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.

Video Advertisement

ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం టాప్ లో ఉన్న ఇంటిసభ్యులలో సిరి ఒకరు. సిరికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, అంతే నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇక ఈ వారం బిగ్ బాస్ విషయానికి వస్తే, కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులని కలుసుకొని మాట్లాడుతున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో కాజల్ కూతురు, భర్త వచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీ రామచంద్ర ఇంటి సభ్యులు, మానస్ తల్లి, షణ్ముఖ్ ఇంటి సభ్యులు, అలాగే సిరి వాళ్ళ తల్లి కూడా షోకి వచ్చారు.

siri fires on her mother in bigg boss telugu 5

అంతే కాకుండా, సిరి తల్లి, సిరితో, షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ, “మీరిద్దరూ అలా హగ్ చేసుకోవడం బాలేదు” అని అన్నారు. “ఒక తండ్రిలా, అన్నలా సిరికి హెల్ప్ చేస్తున్నాడు. తనకి బాగా దగ్గరైపోతున్నాడు. అది నచ్చట్లేదు” అని అన్నారు. దాంతో సిరి తన తల్లిని లోపలి తీసుకువెళ్లి మాట్లాడారు. “నువ్వు ఆ హాగ్ గురించి ఎందుకు మాట్లాడావ్. రోజులో ఉన్న 24 గంటల్లో కేవలం గంట మాత్రమే మీరు చూస్తారు” అని అన్నారు.

siri fires on her mother in bigg boss telugu 5

అందుకు సిరి తల్లి “ఒక తల్లిగా నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్పాను” అని అన్నారు. అందుకు “నువ్వు నాకు చెప్పాలి. కానీ అందరి ముందు ఎందుకు చెప్పావ్? వాడు ఫీల్ అవుతాడు కదా?” అని సిరి అన్నారు. షణ్ముఖ్ కూడా ఈ మాటలు విన్న వెంటనే కొంచెం డల్ అయినట్టు మనం ఎపిసోడ్ లో చూడచ్చు. సిరి తల్లి హౌస్ నుండి వెళ్తూ షణ్ముఖ్ డల్ అవ్వడం చూసి, “డల్ అయిపోయావ్. హుషారుగా ఉండు” అని చెప్పారు.


End of Article

You may also like