Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu -5 : “మా పాప నీ మొఖం కూడా చూడలేదు.!” అంటూ… సిరిపై షన్ను సెటైర్..!

Bigg Boss Telugu -5 : “మా పాప నీ మొఖం కూడా చూడలేదు.!” అంటూ… సిరిపై షన్ను సెటైర్..!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. ఇదిలా ఉండగా నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.

siri gets angry on shannu comments in bigg boss telugu 5

ఈ ఎపిసోడ్ లో అంతకుముందు సిరి, షణ్ముఖ్, కాజల్, మానస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో షణ్ముఖ్ ని సిరి, “బయటికి వచ్చాక చూస్తాను. నీ పెర్ఫార్మన్స్ లో ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తా” అని అన్నారు. అందుకు షణ్ముఖ్, “అంత ఛాన్స్ ఇవ్వదు మా పాప” అంటే, అందుకు సిరి “నేను తీసుకోను కూడా” అని అన్నారు. అప్పుడు షణ్ముఖ్, “అసలు మొఖం కూడా చూడలేదు నీ వైపు” అని అన్నారు. అందుకు సిరి అక్కడి నుండి అలిగి వెళ్లిపోవడం మనం నిన్నటి ఎపిసోడ్ లో చూడొచ్చు.

You may also like