కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల లోను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రులు. ఈ క్రమంలో ఇది పట్టించుకోకుండా కొందరు రోడ్లమీదకు అనవసరంగా వస్తున్నారు.

Video Advertisement

లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా జనం రోడ్లపైకి రావడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.వారిని ఆపి మరీ క్లాస్ తీసుకుంటున్నారు. ఏమాత్రం టెన్షన్ లేకుండా యథేచ్ఛగా రోడ్లపైకి జనం రావడాన్ని తప్పుబట్టారు.వాహనాలపై వెళ్లే వారిని ఆపి.. ఏంటి బయటకు ఎందుకు వచ్చారు? నువ్వు ఏమైనా గొప్పోడివా? నీకు ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా? అంటూ.. కార్లు, బైక్‌లు ఇలా తేడా లేకుండా ఆపి క్లాస్ తీసుకున్నారు.. అటుగా వెళ్తున్న ఓ ఫ్యామిలీని సైతం ఆపి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

watch video: