“బాలు అన్నయ్య” అంటూ సిరివెన్నెల గారు ఏడ్చేసిన ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు.!

“బాలు అన్నయ్య” అంటూ సిరివెన్నెల గారు ఏడ్చేసిన ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు.!

by Mohana Priya

Ads

శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు ఇవాళ మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు.

Video Advertisement

ఇవే కాకుండా 53 సంవత్సరాల సినీ ప్రస్థానం లో ఇంక ఎన్నో అవార్డులను, అలాగే ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అలాగే పాడుతా తీయగా వంటి కార్యాక్రమాల ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించారు. ఎందరో నటులకి కెరీర్ లో గుర్తుండిపోయే పాటలను ఇచ్చారు. అలాగే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఒక టైం లో అసలు బాలు గారు పాడని సినిమా లేదు. తెలుగు లో బాలు గారు చివరిగా పలాస 1978 సినిమా లో పాట పాడారు.

 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంపై ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలు గారికి స్నేహితులు అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బాలు గారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాట్లాడుతూ ” మా అన్నయ్య వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. కానీ సామాజిక బాధ్యతేదో ఒకటి ఉంది కాబట్టి పంచుకోవాలి. భారత జాతి తాలూకు సంస్కృతిలో విడదీయలేని ఒక భాగం బాలు గారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం.

తెలుగు వాళ్ళ గురించి చెప్పడానికి సరిపోదు. చాలామంది మామూలు మాటలు మాట్లాడుతారు. మామూలుగానే మాట్లాడుతారు. తీరని లోటు, పూడ్చలేని లోటు, దిగ్భ్రాంతి ఇవన్నీ. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోషం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు. అకాల సూర్యాస్తమం. ఆయన వయసు చిన్నదా పెద్దదా అని కాదు. మన అందరి గుండెల్లోనూ ఉన్న బాలు స్థానం వేరు. దానికి మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరు.

ఎన్నో పాటలు పాడారు, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఇవన్నీ ఒకే. నిజానికి చాలా మంది గాయకులు వస్తారు, చాలా మంది గాయకులు వెళ్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్తారు. నిజానికి కొందరు వస్తారు. వెళ్లరు. వాళ్లు వెళ్లారు అనుకుంటున్న రోజు కాలం మళ్ళీ వారి పేరుతో కొత్తగా పుడుతుంది. ఈ రోజు ఒంటి గంటకి తెలుగువారి ఇళ్లల్లో మళ్లీ ఆయన పేరుతో కొత్తగా పుట్టింది.

తెలుగు సినిమా పాటకి ఉండవలసిన, ఉన్న ఒక సంస్కారపు స్థాయి గురించి తాపత్రయపడ్డ ఒక్కగానొక్క వ్యక్తి. ఆయనకి అనారోగ్యం ఏంటి? ఆయన మూగబోవడం ఏంటి? చాలామంది చెప్తారు మనుషులు వస్తారు పోతారు అని. కానీ ఆ ఓదార్పు నాకు సరిపోవడం లేదు. ఎందుకంటే బాలు వెళ్లే సమయం కాదు ఇది. తెలుగు పాట గురించి తపించే వాళ్ళు బాలు గారిని గుర్తుచేసుకుంటూ గుర్తు చేసుకోవడం కాదు ఈరోజు నుంచి కాలం బాలు గారి పేరు తో వెళుతుంది.

నేను ఆయనకు ఆత్మ శాంతి కలగాలి, తీవ్ర దిగ్భ్రాంతి, తీరని లోటు ఈ మాటలతోటి సంతోషపడలేను. ఇవాళ సీతారామ శాస్త్రి గా నేను  మీ ముందు నా బాధని చెబుతున్నాను అంటే, దైవానుగ్రహం, గురువులు, తల్లిదండ్రులు, నాకు మరొక పుట్టుక ఇచ్చిన విశ్వనాధ్ గారి తో పాటు, బాలు గారు కూడా కారణం” అని ఎమోషనల్ అయ్యారు సీతారామశాస్త్రి గారు.

Watch video:


End of Article

You may also like