Home Viral ఇదేందయ్యా ఇది…పెళ్ళికొడుకు బూట్ల కోసం కొట్టుకున్న అక్కాచెల్లెళ్లు…! (వైరల్ వీడియో)

ఇదేందయ్యా ఇది…పెళ్ళికొడుకు బూట్ల కోసం కొట్టుకున్న అక్కాచెల్లెళ్లు…! (వైరల్ వీడియో)

by Mohana Priya

మన భారతదేశం పండగలకి, అలాగే ఇతర సందర్భాల్లో ఎంత సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సందర్భాల నుండి పండగల వరకు అన్ని ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి, ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతికి తగ్గట్టుగానే వారు వారి పండుగలు, ఇతర సందర్భాలను జరుపుకుంటారు.

Sister in law fighting for groom shoes video going viral

అలా నార్త్ ఇండియా వైపు వారు పాటించే పద్ధతి ఒకటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి కూతురికి సోదరి కానీ, కజిన్స్ కానీ ఉంటే వారు పెళ్ళికొడుకు వస్తువులని అందులోనూ ముఖ్యంగా బూట్లని దాచిపెట్టి డబ్బులు ఇస్తే వస్తువుల్ని ఇస్తాము అని అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు.

Sister in law fighting for groom shoes video going viral

మనం దీన్ని ఎన్నో హిందీ సినిమాల్లో, సీరియల్స్ లో చూసే ఉంటాం. అందులోనూ ముఖ్యంగా సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ నటించిన హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో ఈ సందర్భం మీద పాటే ఉంటుంది.  అయితే ఇటీవల ఇలానే ఒక పెళ్లిలో కొంతమంది మరదళ్ళు తమ బావ బూట్లను తీసుకోవడానికి తెగ పోటీ పడ్డారు.

Sister in law fighting for groom shoes video going viral

ఇలా బూట్లు తీసుకోవడానికి పోటీపడుతున్న క్రమంలో ఒక యుద్ధమే జరిగింది. బూట్లు లాక్కుంటూ కింద కూడా పడ్డారు. ఈ ఘటనను అంతా పెళ్లికి వచ్చిన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారు అలా బూట్లు తీసుకోవడానికి పోటీపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు.

watch video :

You may also like