పాకిస్థాన్‌లోని శ్రీరాముని గుడిని ఇలా ఉపయోగించుకుంటున్నారా..? ఇదెక్కడి దారుణం..?

పాకిస్థాన్‌లోని శ్రీరాముని గుడిని ఇలా ఉపయోగించుకుంటున్నారా..? ఇదెక్కడి దారుణం..?

by kavitha

Ads

శ్రీ రాముడు హిందువుల ఆరాధ్య దైవం. హిందువులంతా ఎదురు చూస్తున్న రామ జన్మ భూమి అయోధ్యలో సరయు తీరాన రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే బాల రాముడు అయోధ్యలో కొలువుదీరే ముహార్తాన్ని కూడా నిర్ణయించారు. రామ మందిరానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Video Advertisement

అయితే తాజాగా పాకిస్థాన్ లోని అహ్మద్‌పూర్ సియాల్‌లోని చారిత్రాత్మక సీతారామ ఆలయానికి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన ఈ గుడి ఎందుకు వైరల్ గా మరిందో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ లోని అహ్మద్‌పూర్ సియాల్‌లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి  ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన  అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్‌పూర్ సియాల్‌లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్‌గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్‌లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.

Also Read: మరణించిన వారి అస్థికలను “గంగా నది” లో ఎందుకు కలుపుతారో తెలుసా?


End of Article

You may also like