“సీతా రామం” OTT లో రిలీజ్ అయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

“సీతా రామం” OTT లో రిలీజ్ అయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Mohana Priya

Ads

జూలైలో విడుదలైన సినిమాల వరుస ఫ్లాప్ తరువాత, ఆగస్ట్ లో రిలీజ్ అయిన సినిమా సీతా రామం మంచి హిట్ తో, థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా బాగా రాబడుతోంది. వీకెండ్స్ లోనే కాకుండా, వీక్ డేస్ లో కూడా సినిమా కోసం పరుగులు తీస్తున్నారు ప్రేక్షకులు. ఇంత సందడి చేస్తున్న సీతా రామమ్ సినిమా ఓటీటీ లో విడుదలకు సిద్ధం అయిపోయింది.

Video Advertisement

ఇక మంచి రేటుకి సినిమాను కొనుగోలు చేసుకోగా… మంచి సక్సెస్ తో 4 వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫారంలో స్ట్రీమ్ కానుంది. ఒక అనుభూతి చెంది ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా, ఓటీటీలో విడుదల అయితే కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆనందించగలుగుతారు.

sita ramam movie review

అయితే ఈ సినిమా, ఒక అనాథ అయిన లెఫ్టినెంట్ రామ్ కి సీతకి మధ్య జరిగిన ప్రేమ కథ. ఎవ్వరూ లేని తనకి, లేఖల రూపంలో పరిచయం అయిన కుటుంబాలకు చేరువ అవుతూ… సీత ప్రేమ కోసమై అన్వేషిస్తూ, పరితపిస్తున్న సోల్జర్ మనసు కథ ఇది. ఆ ప్రేమ, బంధం, దేశ భక్తి అన్నీ కూడా ఎంతో చక్కగా చూపించిన సినిమాని చూసి యువత మెచ్చుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామమ్ సినిమా అనేది… సుమంత్, భూమిక చావ్లా, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రష్మిక మందన్న, సచిన్ కెడేకర్, ప్రియదర్శి, వంటి ఇతర గొప్ప నటులు కలయిక.


End of Article

You may also like