Ads
- చిత్రం : సీతా రామం
- నటీనటులు : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ కుమార్, తరుణ్ భాస్కర్.
- నిర్మాత : అశ్వినీ దత్
- దర్శకత్వం : హను రాఘవపూడి
- సంగీతం : విశాల్ చంద్రశేఖర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 5, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా లండన్ లో మొదలవుతుంది. అఫ్రీన్ (రష్మిక మందన్న), సీత (మృణాల్ ఠాకూర్) అనే అనే ఒక వ్యక్తికి రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఒక ఉత్తరం ఇవ్వడానికి బయలుదేరుతుంది. లెఫ్టినెంట్ రామ్ 1965లో POK (పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్) లో పోస్టింగ్ కి వెళ్తాడు. రామ్ ఒక అనాధ. రామ్ కి సీతా మహాలక్ష్మి నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అలా ఉత్తరాలు రాసుకున్న తర్వాత ఒకరిని ఒకరు కలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. రామ్ పాకిస్థాన్ కి ఒక మిషన్ మీద వెళ్లి అక్కడ సైనికులకి చిక్కుతాడు. సీక్రెట్ మిషన్ లో ఉన్న రామ్ ని పట్టుకోడానికి పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు సహాయం చేశారు? అసలు అఫ్రీన్ ఎవరు? రామ్, సీత ప్రేమ కథ ఏమయ్యింది? ఇందులో విష్ణు శర్మ (సుమంత్ కుమార్) కి ఉన్న సంబంధం ఏంటి? అఫ్రీన్ ఆ లెటర్ ని సీతకి అందిస్తుందా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
మలయాళ నటుడు అయినా సరే దుల్కర్ సల్మాన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. మహానటి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు దుల్కర్ సల్మాన్. ఇందులో దుల్కర్ సల్మాన్ పాత్రకి చాలా మంచి స్పందన లభించింది. దాంతో తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఆ సినిమాలు అన్నిటికీ కూడా దుల్కర్ సల్మాన్ స్వయంగా తనే తెలుగులో డబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ సీతా రామంతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు.
హను రాఘవపూడి సినిమాలు అంటే క్లాసిక్ సినిమాలు అని పేరు ఉంది. మధ్యలో కొన్ని సినిమాల ఫలితాలు ఆశించినంతగా రాకపోయినా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా హను రాఘవపూడి స్టైల్ సినిమాల్లాగానే క్లాసిక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ పాత్రలో పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్లిపోతుంది అంతే. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషన్స్ ని హైలెట్ అయ్యేలా చేశారు. కథ ముందుకు వెళుతున్న కొద్దీ ప్రేక్షకులకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది.
ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కరెక్ట్ గా సూట్ అయ్యారు. ఇంక ఎవరైనా ఆ పాత్ర చేసి ఉంటే అంత బాగా కనిపించేది కాదేమో అనిపిస్తుంది. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ కూడా మొదటి సినిమా అయినా కూడా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన హైలైట్ గా నిలిచింది. సహాయ పాత్రల్లో నటించిన రష్మిక, దర్శకుడు తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, సుమంత్ కుమార్ మిగిలిన వారు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సినిమాకి హైలైట్ మాత్రం విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు. పాటలు వినడానికి మాత్రమే కాదు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. పాటలు, సినిమా చిత్రీకరించిన లొకేషన్స్ తో పాటు నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఆ కాలం లుక్ వచ్చేలాగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, చుట్టూ ఉన్న వస్తువుల వరకు అన్నింటిలో ప్రత్యేక శ్రద్ధ వహించారు అని చూస్తేనే అర్థమవుతుంది. సినిమా కొంచెం స్లోగా నడుస్తుంది. కానీ లవ్ స్టోరీస్ అంటే దాదాపు అలాగే ఉంటాయి. ఎమోషన్స్ ని మాత్రం తెరపై హైలైట్ అయ్యేలా చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- అప్పటి కాలానికి తగ్గట్టుగా ఉన్న సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్
- నిర్మాణ విలువలు
- సంగీతం
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే ఫస్ట్ హాఫ్
- కామెడీ ట్రాక్
- అక్కడక్కడ బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. క్లాసిక్ సినిమాలు రావడం అయితే చాలా తక్కువ. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ప్రేమకథ సినిమాల్లో ఒకటిగా సీతా రామం సినిమా నిలుస్తుంది.
End of Article