Ads
నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాల నుండి మనల్ని అలరిస్తున్నారు శివాజీ. హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కూడా నటించారు. శివాజీ చివరిగా 2018 లో విడుదలైన వెబ్ సిరీస్ గ్యాంగ్స్టార్స్ (Gangstars) లో కనిపించారు. ప్రస్తుతం శివాజీ రాజకీయాల వైపు కూడా ఉన్నారు. అయితే శివాజీ ఇటీవల రైతు సమస్యల గురించి టీవీ 5 ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Video Advertisement
అందులో యాంకర్ “వేరే దేశాలలో ఉన్న సెలబ్రిటీలు మన రైతు సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు, మన సెలబ్రెటీలు “మా దేశం సమస్య మేము చూసుకుంటాం” అని చెప్పారు కదా? ముందే ఎందుకు చూసుకోలేదు? రైతులని పట్టించుకోరా ఎవరు?” అని అడగగా, అందుకు శివాజీ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
“ప్రతి వాడు నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అదే నిజం కూడా. నాకు రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే 2000 సంవత్సరం మొదటి వరకు మొత్తం దేశ భవిష్యత్తు రైతు మీదే ఆధారపడి ఉంది. అప్పుడు పరిశ్రమలు అంతగా లేవు. తర్వాత పరిశ్రమలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారు.
ఇవాళ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ మొత్తం కూడా “సుమక్క కుక్కతో ఆడుకుంది. భలే ఉంది కదా!” అని ఒక టైటిల్ పెడతారు. దాంట్లో 4 మిలియన్ వ్యూస్. నేను సుమ గారిని తప్పుగా మాట్లాడడం లేదు. ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. అలాగే “అందాలు ఆరబోసిన అనసూయ” అనగానే 8 – 9 మిలియన్ల వ్యూస్ ఉంటాయి.
ఆ అమ్మాయికి ఉన్న క్రేజ్ అలాంటిది. అది తన అదృష్టం. దానిని మనం తప్పుపట్టలేం. అదే, అమరావతి మహిళలు సంవత్సరకాలంగా ఉద్యమం చేస్తున్నారు కళాకారుల మద్దతు కోరుకుంటున్నారు అంటే తొమ్మిది వందల వ్యూస్ వస్తాయి. ఎక్కడుంది లోపం? సమాజం పట్ల అవగాహన జీరో.” అని అన్నారు. అలాగే ఇతర రాజకీయ సంబంధమైన విషయాల గురించి కూడా శివాజీ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
watch video :
End of Article