ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసుంటే..అతని కెరీర్ వేరేలాగా ఉండేదా.?

ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేసుంటే..అతని కెరీర్ వేరేలాగా ఉండేదా.?

by Mounika Singaluri

Ads

హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం శివాజీ ఫామ్ లో ఉండకపోవచ్చు కానీ ఒకప్పుడు శివాజీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి. యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన శివాజీ ఆ తర్వాత వెండితెరపై తన టాలెంట్ తో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. దగ్గర దగ్గర 100 సినిమాల వరకు చేసిన శివాజీ ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. తర్వాత రాజకీయాలలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత కనుమరుగయ్యాడు.

Video Advertisement

అదే శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ లో తన మెచ్యూరిటీతో గేమ్ ని బాగా ఆడుతూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఉంటాడని,ఫైనలిస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రేక్షకుల అభిప్రాయం. ఎందుకంటే అతని ఆట తీరు అంత అద్భుతంగా ఉంది. అయితే శివాజీ కెరియర్లో ఒక మంచి సినిమా అవకాశం రావాల్సింది, ఆ సినిమా గాని శివాజీకి పడి ఉంటే  అతని కెరియర్ గ్రాఫ్ మరొక లాగా ఉండేది.

ఇంతకీ ఏం జరిగిందంటే తొలిప్రేమ సినిమాని కొత్త వాళ్లతో తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ కరుణాకరన్. అతను శివాజీని చూసి హీరోగా పెట్టుకుంటే బాగుంటుంది అని భావించాడంట. అయితే అప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్లు చూసి హీరో అంటే ఇలా ఉండాలి ఇతను మన సినిమాలో హీరో అయితే సినిమా రేంజ్ మారిపోతుంది అని భావించిన కరుణాకరన్  పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అవ్వడం.

పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం ఆ సినిమా విడుదలై ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని డైరెక్టర్ కరుణాకర్ స్వయంగా చెప్పడం విశేషం. ఇప్పుడు బిగ్ బాస్ లో శివాజీని చూస్తున్న జనాలు అదే విషయం గురించి చర్చిస్తూ తొలిప్రేమ సినిమా శివాజీకి పడి ఉంటే అతని రేంజ్ మరోలాగా ఉండేది అని అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like