Mahaveerudu Review : “శివకార్తికేయన్” హీరోగా, రవితేజ వాయిస్ ఓవర్ తో వచ్చిన మహావీరుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Mahaveerudu Review : “శివకార్తికేయన్” హీరోగా, రవితేజ వాయిస్ ఓవర్ తో వచ్చిన మహావీరుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. గత కొద్ది సంవత్సరాల నుండి శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ అనే సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : మహావీరుడు
  • నటీనటులు : శివకార్తికేయన్, అదితి శంకర్, సరిత.
  • నిర్మాత : అరుణ్ విశ్వ
  • దర్శకత్వం : మడోన్ అశ్విన్
  • సంగీతం : భరత్ శంకర్
  • విడుదల తేదీ : జులై 14, 2023.

mahaveerudu movie review

స్టోరీ :

సినిమా కథ అంతా సత్య (శివకార్తికేయన్) అనే ఒక కార్టూనిస్ట్ చుట్టూ తిరుగుతుంది. సత్య తన తల్లి (సరిత), చెల్లి (మనీషా) తో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు. ఒక రోజు అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి మినిస్టర్ ఫండ్ డబ్బుతో కట్టిన ఒక హౌసింగ్ బోర్డ్ అపార్ట్మెంట్ కాలనీకి తీసుకెళ్తారు. కానీ ఆ అపార్ట్మెంట్ లో గోడలకు పెచ్చులు రావడం, పగుళ్లు రావడం జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ బిల్డింగ్ సరిగ్గా కట్టలేదు అని వారికి అర్థం అవుతుంది. సత్య ఈ విషయంపై పోరాడాలి అనుకుంటాడు కానీ తనలోని భయం తనని ఆపేస్తుంది.

mahaveerudu movie review

తన చెల్లెలిని ఒకరు వేధించినా కూడా వారిని తిరిగి ఏమీ అనలేకపోతాడు. ఒక రోజు పొరపాటున బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతాడు. ఆ తర్వాత నుండి తనలో మార్పు మొదలవుతుంది. తనకి పై నుండి ఒక గొంతు (రవితేజ) వినిపించడం మొదలవుతుంది. ఆ గొంతు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది సరిగ్గా చెప్తూ ఉంటాడు. దాంతో సత్య ఎదురు తిరిగి మినిస్టర్ జయకోడి (మిస్కిన్) చేసే తప్పుడు పనులని అడ్డుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్య కి వినిపించే ఆ గొంతు ఏంటి? ఆ గొంతు తను మాత్రమే ఎందుకు వింటాడు? ఆ తర్వాత సత్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో శివకార్తికేయన్ ముందు ఉంటారు. అలా ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ తో శివకార్తికేయన్ పని చేశారు. ఇప్పుడు అశ్విన్ తో పనిచేశారు శివకార్తికేయన్. అశ్విన్ అంతకుముందు మండేలా అనే ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించారు. కామెడీగా ఉంటూనే, ఒక మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ మీద వచ్చిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు లభించాయి.

mahaveerudu movie review

దాంతో అశ్విన్ రెండవ సినిమా అయినా కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే డైరెక్టర్ తన మార్క్ కామెడీతో కొన్ని సీరియస్ విషయాల గురించి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలాంటి కథ ఎంత ఎక్కువ ప్రజలకు చేరితే అంత ఎక్కువ ఆదరణ లభిస్తుంది. శివకార్తికేయన్ ఇలాంటి సినిమా చేయడం అనేది చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక పక్క అమాయకంగా భయపడుతూ కనిపిస్తూనే, మరొక పక్క యాక్షన్ ఉన్న పాత్రలో శివకార్తికేయన్ బాగా నటించారు.

mahaveerudu movie review

సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో పాత రజనీకాంత్ ని చూస్తున్నాం ఏమో అనిపిస్తుంది. ఇంక హీరో మదర్ గా నటించిన సరిత కూడా చాలా రోజుల తర్వాత తెరపై కనిపించారు. చాలా సహజంగా నటించారు. అలాగే మన సునీల్ కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు. హీరోయిన్ అదితి తన పాత్ర పరిధి మేరకు నటించారు. అలాగే ఈ సినిమాలో తెలుగు, తమిళ్ లో అదితి ఒక పాట కూడా పాడారు. అలాగే విలన్ పాత్ర పోషించిన ప్రముఖ దర్శకుడు మిస్కిన్ కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు.

mahaveerudu movie review

తమిళ్ లో విజయ్ సేతుపతితో, తెలుగులో రవితేజతో వాయిస్ ఓవర్ ఇప్పించడం అనేది సినిమా బృందం తీసుకున్న మంచి నిర్ణయం. దాంతో మన రవితేజ గొంతు వింటున్నప్పుడు ఇది మన సినిమానే అని ఒక ఫీలింగ్ వస్తుంది, డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే డబ్బింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు కూడా బాగున్నాయి. డైలాగ్స్ కూడా ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమా డైలాగ్స్ లాగానే ఉన్నాయి. సినిమాకి మరొక ముఖ్య హైలైట్ కామెడీ.

mahaveerudu movie review

యోగి బాబు, శివకార్తికేయన్ కి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. స్పెషల్ గా కామెడీకి అంటూ ఒక ట్రాక్ పెట్టకుండా, వారు చేసే పనుల్లోనే కామెడీ జనరేట్ అయ్యేలాగా రాశారు. ఒక మంచి కథ రాసుకుంటే సరిపోదు. అంతే బాగా తెరపై కూడా చూపించాలి. ఈ విషయంలో డైరెక్టర్ అశ్విన్ చాలా వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. అశ్విన్ రాసుకున్న పాయింట్ ఎంత బాగుందో, తెరపై చూపించిన విధానం కూడా అంతే ఆసక్తికరంగా ఉంది.

mahaveerudu movie review

సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఇంకా దర్శకుడు ఆ పాయింట్ చూపించడంలో కూడా కొన్నిచోట్ల చిన్న చిన్న పొరపాట్లు అయ్యాయి ఏమో అనిపిస్తుంది. కానీ ఏదేమైనా అవన్నీ కూడా సినిమాలో కవర్ అయిపోతాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • శివకార్తికేయన్
  • సెట్ డిజైనింగ్
  • కామెడీ

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • నిడివి ఎక్కువగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ :

3.5/5

ట్యాగ్ లైన్ :

ఒక మంచి కథకి, మంచి దర్శకత్వం, మంచి నటీనటులు, అంతే గొప్పగా ఉండే నిర్మాణ విలువలు అన్నీ కలిస్తే ఒక సినిమా ఎంత బాగా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అవుతుంది. కమర్షియల్ సినిమా అయినా కూడా స్ట్రాంగ్ పాయింట్ తో వచ్చిన సినిమాల్లో ఒకటిగా మహావీరుడు సినిమా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like