Ads
- చిత్రం : ప్రిన్స్
- నటీనటులు : శివకార్తికేయన్, మరియా రియాబోషప్క, సత్యరాజ్.
- నిర్మాత : సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కర్ రామ్ మోహన్ రావు (శ్రీ వేంకటేశ్వర సినిమా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్)
- దర్శకత్వం : అనుదీప్ కె.వి
- సంగీతం : ఎస్.ఎస్.తమన్
- విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022
Video Advertisement
స్టోరీ :
ఆనంద్ (శివకార్తికేయన్) తన ఊరి నుండి బహిష్కరించబడతాడు. ఆనంద్ తండ్రి విశ్వనాధం (సత్యరాజ్) ఆ ఊరిలో ఒక సామాజిక కార్యకర్త. విశ్వనాధంకి ఊరిలో చాలా మంచి పేరు ఉంటుంది. ఆనంద్ తర్వాత ఊరి నుండి వెళ్ళిపోయి ఒక స్కూల్లో టీచర్ గా చేరుతాడు. అక్కడ జెస్సికా (మరియా రియాబోషప్క) తో ప్రేమలో పడతాడు. అసలు సమస్య అప్పుడు మొదలవుతుంది. ఆనంద్ ఊరిలో వాళ్ళు అందరూ కూడా వేరే దేశం అమ్మాయిని ప్రేమించాడు అని గొడవ చేస్తూ ఉంటారు. ఆనంద్ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? ఆనంద్ తండ్రి ఏం చేశాడు? ఆనంద్ ఇవన్నీ ఎలా పరిష్కరించాడు? జెస్సికా, ఆనంద్ కలుస్తారా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత సంవత్సరం జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టారు అనుదీప్. అలాగే శివకార్తికేయన్ కూడా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విషయానికి వస్తే అనుదీప్ గత సినిమా జాతిరత్నాలులో కూడా కథ పరంగా పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేదు. కానీ సినిమాకి కామెడీ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. కథ సాధారణంగా ఉన్నా కూడా కామెడీ మీద సినిమాని నడిపించారు. సినిమాలో చాలా వరకూ జాతిరత్నాలు షేడ్స్ కనిపిస్తాయి.
అలాగే ఊరి నుంచి వచ్చిన హీరో. వేరే అమ్మాయిని ఇష్టపడటం. కొన్ని జోక్స్ కూడా అలాగే అమాయకంగా ఉంటాయి. కొన్ని మాత్రం మరీ జబర్దస్త్ జోక్స్ లాగా అనిపిస్తాయి. సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ శివకార్తికేయన్. డాన్స్ విషయంలో, నటన విషయంలో, స్టైలింగ్ విషయంలో కూడా శివకార్తికేయన్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారు. ముఖ్యంగా శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ వల్లనే తెర మీద చాలా జోక్స్ వర్కౌట్ అయ్యాయి.
హీరోయిన్ మరియా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అలాగే సత్యరాజ్ కూడా తన పాత్రలో బాగా నటించారు. శివకార్తికేయన్ తర్వాత సినిమాకి మరో హైలెట్ తమన్ అందించిన సంగీతం. పాటలు వినడానికి మాత్రమే కాకుండా చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ మరి ఓవర్ గా అనిపిస్తాయి. దాంతో మొత్తం కామెడీ మీదే ఆధారపడకుండా పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- శివకార్తికేయన్
- కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్
- నిర్మాణ విలువలు
- మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కథ పరంగా కొత్తదనం ఏమీ ఆశించకుండా, లాజిక్స్ కూడా వెతుక్కోకుండా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారిని ప్రిన్స్ సినిమా అస్సలు నిరాశ పరచదు.
End of Article