Ads
ప్రభుత్వం లాక్ డౌన్ సడలించి అవసరమైనప్పుడు ప్రజలు బయటికి వచ్చి వారి పనులను పూర్తి చేసుకొని వెళ్లొచ్చు అని ఆదేశం జారీ చేసింది. షాపుల ముందు క్యూ పద్ధతి పాటించాలి అని, మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి అని కూడా హెచ్చరించింది. కానీ ఆ దూరం తో కూడా మనిషి నుండి మనిషికి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అని సైన్స్ చెబుతోంది.
Video Advertisement
ఈ మధ్య చేసిన ఒక సర్వే లో “ఆరడుగుల సామాజిక దూరం సరిపోదు అని, ఎందుకంటే మనిషి దగ్గితే 4 నుండి 15 కి.మీ వరకు గాలిలో ఆ దగ్గు ప్రభావం ఉంటుంది. అలా దగ్గినప్పుడు నోట్లో నుండి వచ్చే ఉమ్ము 18 అడుగుల వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది.” అని తాలిబ్ డ్బౌక్ మరియు డిమిట్రిస్ డ్రికాకిస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి కనుగొన్నారు..
ఆ దగ్గిన మనిషి చుట్టుపక్కల చిన్నపిల్లలు , వృద్ధులు ఉంటే వారికి ఇంకా వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు.“మనం ఎంత గట్టిగా దగ్గితే అంత ఎక్కువగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అప్పుడు ఆ దగ్గులో ఉన్న ప్రెజర్, వెలాసిటీ వల్ల ఉమ్ములో ఉండే కణాలు ఆవిరి లా మారి దగ్గు ప్రభావం ఎక్కువ దూరం విస్తరించి వ్యాధులు సోకే సూచనలు పెరుగుతాయి. “ అని ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు అన్నారు .
ఇంకా ఉష్ణోగ్రత, భూమి ఉపరితలం, ఇండోర్ వాతావరణాలు, కూడా పరిశీలించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క దగ్గు వల్లే కాదు ఇంకా చాలా రకాలుగా మనకి తెలియకుండానే మనం అంతగా శ్రద్ధ తీసుకునే అవసరం లేకుండా చేసే చిన్న చిన్న పనులు, అలవాట్ల వల్ల కూడా వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిశోధన ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఆరోగ్యం మరియు భద్రత కు సంబంధించినది ప్రజలలో అవగాహన నూ అభివృద్ధి చేస్తుంది. రీసెర్చ్ ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా ముందు జాగ్రత్త చర్యలు రూపొందించడం లో ఉపయోగపడుతుంది డ్రికాకిస్ చెప్పారు.
source :https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/six-feet-may-not-be-far-enough-for-safe-social-distancing-study/articleshow/75860507.cms
End of Article