Ads
తమిళ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య గురించి తెలిసిందే. కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించాడు.పవన్ కళ్యాణ్ తో తీసిన ఖుషి సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
Video Advertisement
పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఖుషి మూవీ నే.ఇప్పటికీ కూడా తెలుగులో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఖుషి ఉంటుంది. తర్వాత ఎస్ జె సూర్య ట్రాక్ తప్పాడు.
తనకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్యకి రెండో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన కొమరం పులి మూవీ డిజాస్టర్ గా నిలిచింది.మహేష్ బాబుతో నాని మూవీ ని తెరకెక్కించాడు.ఇది ఒక ప్రయోగాత్మకమైన చిత్రం.
తర్వాత దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఎస్ జె సూర్య యాక్టింగ్ లోకి దిగాడు. కోలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలానే విజయ్ వారసుడు సినిమాలో కూడా యాక్ట్ చేశారు. తాజాగా విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో జిగర్తాండ 2 సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పుడు ఎస్ జె సూర్య ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. తెలుగులో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాలో క్యారెక్టర్ కోసం ఎస్ జె సూర్య ని అడగగా తన రెమ్యూనరేషన్ విని డైరెక్టర్, ప్రొడ్యూసర్ లు షాక్ అయ్యారు. తనకి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవాలని ఏకంగా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా అడిగారట.అయితే ఎస్ జె సూర్యకి అంత రెమరేషన్ ఇవ్వలేక ఆ మూవీ టీం వేరే ఆప్షన్ కి వెళ్లిపోయారట.
Also Read:ఇద్దరు హీరోలు హిట్ కొట్టారంటగా..?” అంటూ… “భగవంత్ కేసరి – లియో” రిలీజ్‌పై 15 మీమ్స్..!
End of Article