Ads
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెకంట్ రెడ్డి రాజీనామాతో కేవలం నియోజకవర్గంలోనే కాకుండా ఏకంగా రాష్ట్రమంతా మునుగోడులో గెలుపు ఎవరిది అని చర్చించుకుంటున్నారు. వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పాటూ కాంగ్రెస్ పార్టీకి సైతం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎంతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ నుండి వెంకట్ రెడ్డి బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Video Advertisement
అయితే వెంకట్ రెడ్డి ఎందుకు తన పదవికి మరియు పార్టీకి గుడ్ బై చెప్పారు అన్నది చాలా మందికి ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. కాగా నియోజకవర్గంలో జరుగుతున్న ఓ చర్చ ప్రకారం వెంకట్ రెడ్డి తన కలల ప్రాజెక్ట్ అయిన ఎస్ఎల్ బీసీ కోసమేనట. ఫ్టోరైడ్ కోరల్లో నుండి నల్లగొడ ప్రజలను రక్షించేందుకు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి కోమటిరెడ్డి మొదడులో తట్టిన ఆలోచనే ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ అని మునుగోడు ప్రజలు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం వెంకన్ననే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వెంటపడి ఒప్పించారు. అప్పట్లో దేశంలోనే అతిపెద్ద సొరంగమార్గం కలిగిన ప్రాజెక్ట్ ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ను 1965 కోట్లతో పూర్తిచేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. 20007 నుండి 2013 వరకూ ఈ ప్రాజెక్టు కోసం 817 కోట్ల నిదులు మంజూరు అయ్యాయి.
ఈ ప్రాజెక్ట్ వెనక వెంకన్న కృషి ఎంతో ఉంది. ఇక 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరవాత ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గానూ 34 కిలోమీటర్ల వరకూ కేసీఆర్ అధికారంలోకి రాకముందే తవ్వించారు. ఇంకా మిగిలి ఉంది కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరవాత కేవలం ప్రాజెక్టు కోసం బడ్జెట్ నుండి మూడు కోట్ల చొప్పున మాత్రమే మంజూరు చేస్తూ వచ్చారు. దాంతో వెంకట్ రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి 2000 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని వాటిని విడుదల చేయాలని లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగున్నాయి. మరోవైపు ప్రభుత్వం జీవో 246 తో నల్గొండ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తుందట. ఈ జీవో వల్ల 45 టీఎంసీల నీరు పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తరలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డి జీవోకి వ్యతిరేఖంగా పోరాటం చేశారు. ఇక ఇప్పుడు మునుగోడులో గెలిస్తే నల్గొండ ప్రజల గొంతుకను తడపడంతో పాటూ లక్షల ఎకరాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టను పూర్తి చేస్తానని వెంకట్ రెడ్డి హామీ ఇస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో నల్గొండ ప్రజలు ఎటువైపు నిలబడతారో చూడాలి.
End of Article